జేడీఎస్ అధినేత, మాజీప్రధాని దేవెగౌడ.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. తాను 2019 ఎన్నికల్లో పోటీచేయనని మొదట ప్రకటించిన దేవెగౌడ.. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడితో మనసు మార్చుకున్నారు. లోక్ సభ బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. బెంగళూరు ఉత్తర పార్లమెంట్ నుంచి పోటీచేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టారు..
తాను 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా మైసూరు-కొడుగు లోక్ సభ నియోజకవర్గాలను జేడీఎస్ కు వదిలిపెట్టాలని మాజీ ప్రధాని హెచ్.డీ కుమారస్వామి అల్టీమేటం జారీ చేశారు. ఇవీ కాకుంటే తుమకూరు లోక్ సభ సీటును అయినా జేడీఎస్ కు వదిలిపెట్టాలని దేవెగౌడ కోరారు. అయితే జేడీఎస్ అధినేత నుంచి వస్తున్న ఈ డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు అంగీకరించడం లేదు.
కర్ణాటకలో ఇప్పటికే జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు తెగడం లేదు. మైసూరు, లేదా తుమకూరు సీట్లను కేటాయించాలని దేవెగౌడ కోరికను కాంగ్రెస్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యతిరేకించారు. తూమకురును ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ అంగీకరించలేదు.
కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఒప్పుకోకపోవడంతో జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దేవెగౌడను బీజేపీ కేంద్ర మంత్రి సదానందగౌడపై బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి నిలబెట్టి ఓడించాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. ఆయన ఇలా మెలికపెట్టడంతో ఎటూ తేలడం లేదట..