పెను ప్రమాదం నుంచి మహారాష్ట్ర ముఖ్యమత్రి తృటిలో తప్పించుకున్నారు. సాధారణంగా హెలికాఫ్టర్ కానీ ప్రమాదానికి గురైతే నష్ట తీవ్రత భారీగా ఉంటుంది. అదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి నుంచి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పించుకున్నారు. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాతూర్ వద్ద క్రాష్ అయ్యింది.
ఈ ఘటనలో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదని.. ఆయన సేఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఫడ్నవీస్ తాజాగా ట్వీట్ చేశారు. సీఎంతో పాటు హెలికాఫ్టర్ లో ఉన్న సభ్యులంతా కూడా సురక్షితంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం చాపర్ క్రాష్ అయిన విషయం తనను షాక్‌కు గురైందని కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. ఫడ్నవీస్ కు ఏం కాలేదన్న విషయం చాలా ఆనందకరమని వ్యాఖ్యానించారు.
హెలికాఫ్టర్ లో చోటు చేసుకున్న సాంకేతిక లోపం కారణంగానే తాజా ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సీఎంవో ఒక ప్రకటన జారీ చేసింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. పది రోజుల క్రితం ఈ హెలికాఫ్టర్‌కు సాంకేతి లోపం చోటు చేసుకుంది. అయినప్పటికీ ఎందుకు వినియోగిస్తున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. సీఎం స్థాయి వ్యక్తుల భద్రత మీద అంత నిర్లక్ష్యం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/