ఆ సినిమా కోసం సీఎం పంచాయితీ..

Update: 2016-10-22 07:44 GMT
ఒక సినిమా కోసం ముఖ్యమంత్రే స్వయంగా పంచాయితీ పెడతారా? అన్న సందేహం కలగొచ్చేమో కానీ.. ఇది నిజం. సాధారణంగా సినిమా విడుదల విషయంలోనో.. మరే అంశం మీదనైనా వివాదం నెలకొంటే.. దాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు సినీ రంగానికి చెందిన పెద్దలు కలుగజేసుకోవటం.. ఇష్యూ సెట్ చేయటం కనిపిస్తుంది. అలాంటిది.. తాజాగా ఒక హిందీ సినిమా కోసం ఏకంగా సీఎమ్మే సీన్లోకి వచ్చిన ఉదంతం చోటు చేసుకుంది.

మామూలు సినిమా కోసమైతే ఇంత తతంగం జరిగేది కాదేమో? కరణ్ జోహార్ లాంటి పెద్ద నిర్మాతకు చెందిన సినిమా కావటంతో మామూలుగా ఆలోచించలేని విషయాలు ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పకతప్పదు. ఐశ్వర్యారాయ్ బచ్చన్.. రణబీర్ కపూర్ తో పాటు పాకిస్థానీ నటుడు నటించిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్ర విడుదల మీద గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతున్నది తెలిసిందే. పాకిస్థానీ నటులు ఈ సినిమాలో నటించటంతో ఈ సినిమా విడుదలను అడ్డుకోవటంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే రంగంలోకి దిగటంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. రాజ్ థాక్రే సీన్లోకి రావటం.. ఈ సినిమా విడుదలపై పలు రాష్ట్రాల్లో నీలి నీడలు కమ్ముకున్నాయి.

చాలా కాలం తర్వాత పూర్తి వాణిజ్యపరమైన సినిమాలో చెలరేగిపోయిన ఐష్ పుణ్యమా అని ఈ సినిమాకు ఎంత క్రేజ్ రావాలో అంత క్రేజ్ వచ్చేసింది. అందాల ప్రదర్శన విషయంలో రెచ్చిపోయిన ఐష్ పుణ్యమా అని ఈ సినిమాకు భారీ బిజినెస్ జరగటమే కాదు.. భారీ కలెక్షన్లు పక్కా అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళలో సినిమా విడుదల సాధ్యం కాదన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకోవటంతో ఈ ఇష్యూను క్లోజ్ చేయటానికి సినీ రంగానికి చెందిన దిగ్గజాలు తెర వెనుక పావులు కదపటంతో ముఖ్యమంత్రే సీన్లోకి వచ్చేశారు.

నిర్మాణ కరణ్ జోహార్.. మహేశ్ భట్ తో పాటు.. మహారాష్ట్ర  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రేలతో కూడిన బృందం సీఎం ఇంట్లో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తమ రెండు డిమాండ్లను నిర్మాత అంగీకరిస్తే.. సినిమా విడుదలకు తాము అభ్యంతరం చెప్పమంటూ రాజ్ థాక్రే చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇందులో ఒకటి.. ఉరీ ఉగ్రదాడిలో చనిపోయిన అమరజవాన్లకు నివాళులు అర్పిస్తూ ప్రకటన ఇవ్వటం.. భవిష్యత్తులో తీసే సినిమాల్లో పాకిస్థానీ నటీనటులను తీసుకోకపోవటం డిమాండ్లకు ఓకే చెబితే రిలీజ్ కు తమ అభ్యంతరం ఉండదన్నారు. దీనికి కరణ్ ఓకే చెప్పటంతో ఐష్ సినిమాకు లైన్ క్లియర్అయినట్లేనని చెప్పొచ్చు. ఒక సినిమా విడుదల కోసం ముఖ్యమంత్రే సీన్లోకి రావటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News