రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయన్నది తెలిసిందే. ఎంతలో ఎంత మార్పు చోటు చేసుకుంటుందన్న విషయంలో గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులే నిదర్శనంగా చెప్పొచ్చు. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ కేవలం 90 గంటల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆపధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఫడ్నవీస్ ప్రొఫైల్ పలు మార్పులు చేర్పులకు చోటు చేసుకుంది. తొలుత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారింది.. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన రావటంతో ఆయన ప్రొఫైల్ లో హోదా మహారాష్ట్ర సేవకుడిగా మారింది.
గత శనివారం తెల్లవారుజామున అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటంతో ఆయన ప్రొఫైల్ లో ముఖ్యమంత్రి హోదా వచ్చి చేరింది. ఇది జరిగిన నాలుగు రోజులకే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంగవారం సాయంత్రం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడాయన ప్రొఫైల్ లో అపద్దర్మ ముఖ్యమంత్రి అన్న హోదా వచ్చి చేరింది. రేపు ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హోదా మరోసారి మారనుంది. ఇలా నెల వ్యవధిలో పలుమార్లు ట్విట్టర్ ఖాతాలో ఆయన హోదా మారిపోవటం ఆసక్తికరంగా మారింది.