గ్రేటర్ ఎన్నికల నేపథ్యమో..ఏమో తెలియదు కాని ఇటీవల తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు కూడా ఏదైనా చేయాలంటే అది తెరాస ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని..ఎవ్వరి వల్లా కాదని చెప్పడమే తెరాస ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. శుక్రవారం ధూల్ పేటలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను - రాష్ట్రాన్ని మోడీ పూర్తిగా విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ కు లక్షన్నర కోట్ల ప్యాకేజీ - జమ్మూ కశ్మీర్ కూ భారీ ప్యాకేజీ ప్రకటించిన ఆయన, తెలంగాణకు మాత్రం అలా ఎందుకు ప్రకటించడం లేదు? దమ్ముంటే బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మోడీని ఒప్పించి తెలంగాణకు రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ఇప్పించాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రులెవరూ అంత తీవ్రంగా స్పందించలేదు.. కానీ ఇప్పుడు ప్రధానిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్రప్రదాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీప్రధాని అటల్ బిహారీ వాజపేయి 91వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. `ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం బీజేపీ మద్దతుతోనే జరిగింది. కానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఆయనకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నా. అహంకార పూరిత వ్యాఖ్యలు మానుకుని ముందు మీ నాన్నను సచివాలయానికి పిలిపించుకో` అని కేటీఆర్ నుద్దేశించి ఆయన ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధి గురించే ఆలోచిస్తే.. ప్రధానిని కలిసి మాట్లాడుకోవాలని కేటీఆర్ కు ధర్మేంద్ర సూచించారు.
భారత్ ను ప్రపంచదేశాల సరసన చేర్చిన ఘనత మాజీ ప్రధాని వాజ్ పేయ్ దేనని ఆయన కొనియాడారు. ప్రస్తుతం నరేంద్రమోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయన్నారు. హైదరాబాద్ త్వరలోనే వైఫై నగరంగా మారబోతోందని మరో మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తోందన్నారు. కాగా, మోడీని విమర్శించే స్థాయి మజ్లిస్‌కు లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ధర్మేంద్ర వ్యాఖ్యలు చూస్తే తెరాస నాయకులపై కేంద్ర మంత్రులు టార్గెట్ పడినట్టే కనిపిస్తోంది.