కొండంత తండ్రి కంటి ముందే కనపడకుండా పోతుంటే ఏ కొడుక్కి మాత్రం బాధ వేయదు. అందునా.. తన రాజకీయ భవిష్యత్తును తానే దగ్గరుండి తీర్చిదిద్దాలని తపించిన తండ్రి ఇక శాశ్వితంగా కనిపించరన్న భావన ఎంత భాదగా ఉంటుందో తాజాగా దేవినేని అవినాశ్‌ను చూస్తే అర్థమవుతుంది. అనారోగ్యంతో నిన్న (సోమవారం) హైదరాబాద్ లో కన్నుమూసిన దేవినేని నెహ్రూ అంతిమ సంస్కారం ఈ రోజు జరిగింది.
విజయవాడలోని గుణదలలోని నెహ్రూ స్వగృహం నుంచి నున్న మార్కెట్‌కు వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారం జరిగింది. తన తండ్రిని చివరిసారి చూసుకునే క్రమంలో.. నెహ్రూ పార్థిపదేహంపై మోకరిల్లి బోరుమన్న అవినాశ్ ను చూసిన వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు.
దేవినేని అంత్యక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు.. మంత్రులు దేవినేని ఉమ.. ప్రత్తిపాటి పుల్లారావు.. పరిటాల సునీత.. కామినేని శ్రీనివాస్.. కొల్లు రవీంద్ర.. నక్కా ఆనంద్ బాబు.. జవహర్ లతో పాటు.. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్.. బోండా ఉమామహేశ్వరరావు.. తంగిరాల సౌమ్య.. ఎమ్మెల్సీలులు కరణం బలరాం.. బుద్దా వెంకన్న తదితర నాయకులు.. పెద్ద ఎత్తున కార్యకర్తలు.. అభిమానులు హాజరయ్యారు.
గుణదల నుంచి నున్న మార్కెట్ దగ్గరల్లోని వ్యవసాయ భూమి వరకూ సాగిన అంతిమ యాత్రలో.. నెహ్రూను కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు రోడ్ల పక్కన బారులు తీరారు. ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపి.. అంత్యక్రియల్ని పూర్తి చేశారు. తండ్రిని కోల్పోయిన అవినాశ్ ఆవేదన పలువురిని కదిలించివేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/