ఎప్పటికీ బాబుతోనే ఉంటాడట!

Update: 2019-08-06 09:21 GMT
ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. చేతిలో ఉన్న అధికారం చేజారిన తర్వాత పార్టీ క్యాడర్ డీలా పడటం మామూలే అయినా.. పార్టీకి వెన్నుముకలా ఉండాల్సిన ముఖ్యనేతలు ఏదో కారణంగా చెప్పేసి పార్టీ నుంచి జంప్ అవుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నుంచి వరుస పెట్టి పలువురు నేతలు వెళ్లిపోవటం.. మరికొందరు అదే బాటలో ఉన్నారంటూ పలు పేర్లు తరచూ వినిపిస్తున్న వైనం తెలిసిందే.

తాజాగా ముగిసిన ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దేవినేని అవినాష్ తన తొలి ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవటం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత.. పలువురు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న వేళ.. దేవినేని అవినాష్ సైతం పార్టీ మారటం ఖాయమన్న మాట జోరుగా వినిపించింది. అయితే.. ఈ పుకార్లు ఎక్కడ.. ఎలా స్టార్ట్ అయ్యాయన్న విషయం తేలకున్నా.. వీటిపై దేవినేని అవినాష్ సైతం స్పందించకపోవటం..వాటిని ఖండించకుండా మౌనంగా ఉండటంతో పార్టీ మారటం ఖాయమా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి వేళ తాజాగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన దేవినేని అవినాష్ తాను టీడీపీలోనే కంటిన్యూ అవుతానని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడూ తెలుగుదేశంపార్టీతోనూ.. బాబు వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ తో.. ఇప్పటివరకూ వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News