ఔను. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి బాహుబలి దొరికేశాడట! సదరు బాహుబలి....పచ్చ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన నేతను ఓడిస్తాడట!! పార్టీ ఏదైనా గెలుపును సొంతం చేసుకుంటున్న మాస్ లీడర్‌ను నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన యువనేత మట్టికరిపిస్తాడట. ఇదంతా చెప్తోంది తెలుగుదేశం పార్టీ నేతలు. సదరు మాస్ లీడర్....గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఆ బాహుబలి ఎవరంటే... తొలిసారిగా బరిలో దిగుతున్న దేవినేని అవినాష్.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల దేవినేని అవినాష్ నియమితులు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు. 2019 ఎన్నికల్లో కృష్ణాజిల్లా వైసీపీలో ఉన్న భల్లాల దేవుడు లాంటి వ్యక్తిపై అవినాష్ పోటీకి దిగుతాడని ప్రకటించారు.! అవినాష్ పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడన్న ఆయన... ఎన్నికల తర్వాత దేవినేని అవినాష్‌ని బాహుబలిగా పిలుస్తారన్నారు. తద్వారా పార్టీ కంటే ముందే....వెంకన్నే అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా....ఫలితాల కంటే ముందే...విజేతను కూడా తేల్చేశారు.
కాగా, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉద్దేశించి బుద్దా వెంకన్న పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది తేటతెల్లం అవుతోంది. కొడాలి నాని, బుద్దా వెంకన్న మధ్య పలు మార్లు మాటల యుద్ధం, సవాల్, ప్రతి సవాళ్లు నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వెంకన్న ఈ సూత్రీకరణ చేశారు. వెంకన్న విశ్లేషణ బాగానే ఉన్నప్పటికీ...పోరు ఏదైనా విజయపథంలో సాగుతున్న కొడాలి నానిని అవినాష్ ఓడించగలడా? టీడీపీ నేతలు చెప్తున్నట్లు బాహుబలిగా నిలుస్తాడా? సమాధానం కోసం...మరికొన్ని నెలలు ఆగాల్సిందే!