తెలుగోళ్ల ముద్దుబిడ్డ దివంగత ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. ఆయనకు నమ్మినబంటు అయిన మాజీ మంత్రి దేవినేని నెహ్రు.. ఈ రోజు గుండెపోటు కారణంగా మరణించటం తెలిసిందే. గడిచిన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. సోమవారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్త విన్న వెంటనే పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తమ సంతాపాన్ని తెలియచేశారు. నెహ్రు కుటుంబ సభ్యులకు నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నెహ్రూ మరణవార్త విన్నవెంటనే అభిమానులు తీవ్ర షాక్ కు గురయ్యారు. అప్పటికప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లేందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నాయి. అయితే.. అభిమానులు.. కార్యకర్తలు.. అనుచరులు ఎవరూ హైదరాబాద్ రావొద్దని నెహ్రూ కుమారుడు అవినాష్ కోరారు. ఇప్పటికే నెహ్రూ భౌతికకాయాన్ని విజయవాడకు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన నెహ్రూ భౌతిక కాయం ఈ సాయంత్రానికి విజయవాడకు చేరుకోనుంది. రేపు (మంగళవారం) ఆయన అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/