రీసెంటుగా టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ అప్పుడే తన హవా చూపించడం ప్రారంభించారట. దీంతో నెహ్రూ రాకను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి చంద్రబాబును కలిసి కంప్లయింటు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. నిజానికి నెహ్రూ టీడీపీలో చేరినప్పటి నుంచే తనకు స్థానిక నేతలతో సయోధ్య అవసరం లేదన్నట్లుగా ఉన్నారు. చేరిక సమయంలో బాగా హడావుడి చేసినా అందులో అంతా నెహ్రూ - ఆయన కుమారుడు అవినాష్ గురించే తప్ప వేరే వాళ్ల గురించి లేదు. ఆ సందర్భలో ముద్రించిన పోస్టర్లలో విజయవాడకు చెందిన ఏ ఒక్క నేత ఫొటో కూడా లేదు. అలాగే నెహ్రు రాకను వ్యతిరేకించిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ - బోడె ప్రసాద్ లు కూడా నెహ్రు చేరిక సభకు హాజరుకాలేదు. చంద్రబాబు చెప్పడంతో అయిష్టంగానే మౌనంగా ఉండిపోయారు.
అక్కడితో అంతా అయిపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో కొత్త వివాదం మొదలైంది. దేవినేని నెహ్రు తాజాగా ఒక అపార్ట్ మెంట్ వద్ద గోడ కూల్చివేయించడం కొత్త వివాదానికి తెరతీసింది. అపార్ట్ మెంట్ వాసుల పక్షాన వల్లభనేని వంశీ నిలబడ్డారు. విజయవాడలోని ఎనికెపాడులో ఓ అపార్ట్ మెంట్ దగ్గర కల్వర్టు గోడును దేవినేని అనుచరులు కూల్చివేశారు. దేవినేని నెహ్రుయే స్వయంగా వచ్చి తమను బెదిరించారని అపార్ట్ మెంట్ వాసులు వాపోయారు. దీంతో విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ అపార్ట్ మెంట్ వాసులను కలిసి అండగా నిలిచారు. నెహ్రు చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి దౌర్జన్యాలు టీడీపీలో చేస్తే చంద్రబాబు సహించరని హెచ్చరించారు. సామాన్యులపై ప్రతాపం చూపడం మానుకోవాలని హితవు పలికారు. నెహ్రు దౌర్జన్యాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. వంశీ ఆరోపణలపై దేవినేని నెహ్రు అనుచరుడు అన్నె చిట్టిబాబు కౌంటర్ ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. లారీల రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంతో లారీ డ్రైవర్లే గోడను కూల్చివేశారు తప్ప నెహ్రూ ప్రమేయం లేదని చెప్పారు. తన గోడౌన్ కోసం దేవినేని నెహ్రు కోటిన్నర పెట్టి సొంతంగా రోడ్డు వేయించుకున్నారని ఆయన చెప్పారు.
కాగా నెహ్రూ బెజవాడలో ఆధిపత్యం చెలాయించడం కోసం ప్రయత్నిస్తున్నారని.. అంతేకాకుండా ఇప్పుడు విజయవాడలో ఉన్న టీడీపీ నేతలంతా తన ముందు బచ్చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. నేనే సీనియర్ అన్నట్లుగా నెహ్రు వ్యవహరిస్తుండడంతో మిగతా నేతలతో విభేదాలు తీవ్రమవుతున్నాయని చెబుతున్నారు. ఇది ఎక్కడకు దారి తీస్తుందోనంటున్నారు.