విజయవాడ రాజకీయ సంచలనం, రాష్ట్ర నేత, తెలుగు దేశం నాయకులు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం (కొద్దిసేపటి క్రితం) హైదరాబాదులోని ఆస్పత్రిలో మరణించారు. ఆయనకు కొంత కాలంగా ఆరోగ్యం బాగాలేదు. కిడ్నీ సమస్యలతో ఇటీవలే ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆస్పత్రిలో ఉండగానే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు.
ఆయన వయసు 62 ఏళ్లు. వ్యవసాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-96 సమయంలో ఎన్టీఆర్ కేబినెట్లోనే ఆయన మంత్రిగా చేశారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గతంలో గెలిచారు. ఒకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు.