ముగిసన కథ మళ్లీ మొదలెట్టొద్దు

Update: 2016-02-28 07:24 GMT
30 ఏళ్ల నాటి మనస్పర్థలను ఇప్పుడు సినిమాగా తీస్తానని వర్మ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అంటున్నారు. కులాలు కుటుంబాల మధ్య ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్మ సినిమా తీస్తాననడం సరికాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రశాంతంగా ఉందని..  ప్రస్తుతం ఎవరి పనులు వారు చేసుకుంటున్న సమయంలో పాత కథలు తిరగదోడడం ఎందుకన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. వంగవీటి సినిమాకు అనవసర ప్రచారం కల్పించొద్దని, 30 ఏళ్ల కింద చిన్న గొడవ వల్ల రెండు కుటుంబాలకు నష్టం జరిగిందని నెహ్రు చెప్పారు. దీంతో ఇంతకాలం వంగవీటి సినిమాను ఆయన కుమారుడు వంగవీటి రాధా ఒక్కరే వ్యతిరేకిస్తుండగా ఇప్పుడు దేవినేనికి కూడా ఆ సినిమా ఇష్టం లేదని తేలింది.

తాను వర్మకు కొత్తగా సమాచారం ఇచ్చిందేమీ లేదని, వర్మకు అంతా తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలను సెన్సార్ చేయాలని మాత్రం ఆయన సూచించారు. వర్మ రిలీజ్ చేసిన వంగవీటి సినిమాలోని రెండు పాటలు సామాజిక వర్గాల పేర్లను ప్రస్తావిస్తూ సాగిన నేపథ్యంలో దేవినేని ఈ సూచన చేసినట్లు దేవినేని అనుచరులు చెబుతున్నారు.

మరోవైపు వంగవీటి సినిమా కోసం విజయవాడ వచ్చిన ఆయనను కలిసేందుకు రంగా భార్య రత్నకుమారి నిరాకరించగా, రంగా పాత అనుచరులతో వర్మ ఇప్పటికే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ముద్రగడ పార్టీ పెడితే పార్టీలో తాను అందులో చేరతానని, అసలైన మెగాపవర్ స్టార్ ముద్రగడ పద్మనాభమేనని వర్మ ట్విట్టర్‌ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలోపనిగా చిరంజీవి - పవన్ కల్యాణ్‌ పై సెటైర్లు విసిరారు. ఈ బిరుదులు పెట్టుకున్న సినిమా స్టార్లు మాత్రం నకిలేనని చిరు - పవన్‌ పై పరోక్ష విమర్శలు చేశారు. కమ్మ మనస్తత్వం ఉన్న సినిమా ఇండ్రస్టీలోని కాపులతో పోలిస్తే, ముద్రగడే అసలైన మెగాస్టార్ అని వర్మ స్పష్టం చేశారు. ఇది చిరు, పవన్‌ నుద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా పలువురు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News