దేవినేని..హరీశ్ లు మళ్లీ గంట కూర్చున్నారిజల్ట్ అదే

Update: 2016-06-23 07:34 GMT
కృష్ణా జలాల వినియోగం మీద రెండు తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న లొల్లిని తగ్గించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలితం ఇవ్వటం లేదు. బుధవారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులతో కలిపి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేసిన ప్రయత్నం ఫలితం ఇవ్వకపోవటం.. తాజాగా ఈ రోజు ఉదయం కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారి అమర్ జిత్ సింగ్ సమక్షంలో భేటీ జరిగింది.

గురువారం ఉదయం జరిగిన ఈ భేటీలో సింగ్ కు ఎదురుగా ఇరువురు రాష్ట్ర మంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. ముందుగా.. దేవినేని ఉమనే చర్చను షురూ చేసి.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఉమ చెప్పిన విషయాల్ని సావధానంగా విన్న హరీశ్.. తర్వాత తన వాదనను సుదీర్ఘంగా వినిపించినట్లు చెబుతున్నారు.

దాదాపు గంటకు పైనేసాగిన వీరి భేటీలో ఎలాంటి ప్రయోజనం లేదని.. ఇద్దరి మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో ఈ భేటీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎవరి ప్రయోజనాలు వారికే అన్న భావనే తప్పించి.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేనప్పుడు ఎన్నిసార్లు.. ఎన్ని గంటలు భేటీ అయినా ఫలితం సేమ్ టు సేమే అవుతుంది మరి.
Tags:    

Similar News