సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తిట్టుకోవటం.. పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు చేసుకోవటం ఈ మధ్యన ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే.. ఇది కాస్తా శ్రుతిమించి రాగాన పడటమే కాదు.. తమ ప్రత్యర్థుల పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం.. ఆస్తుల్ని ధ్వంసం చేయటం.. వారి నేతల కార్లను తగలబెట్టటం లాంటి ఆరాచకాండకు కేరాఫ్ అడ్రస్ గా మారింది గన్నవరం. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల ఆరాచకంతో గన్నవరం చిగురుటాకులా వణికింది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కత్తులు..కర్రలతో వీరంగం వేసిన వంశీ అనుచరులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై విరుచుకుపడటమే కాదు.. కనిపించిన వారిని గాయపరుస్తూ.. కనిపించిన వస్తువులను ధ్వంసం చేస్తూ దాదాపు గంట పాటు ఆరాచకం అంటే ఎలా ఉంటుందన్న దాన్ని అందరికి తెలిసేలా చేశారు. ఇంత జరుగుతున్నా.. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన పోలీసులు మాత్రం అదేమీ పట్టనట్లుగా వ్యవహరించిన ధోరణి షాకింగ్ గా మారింది.
పార్టీ ఆఫీసుపై ఎమ్మెల్యే అనుచరులు దాడులకు పాల్పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నేతలు పలువురు గన్నవరానికి బయలుదేరి వెళ్లారు. అయితే.. వైసీపీ వర్గీయుల ఆరాచకాన్నిఅడ్డుకునే సాహసం చేయని పోలీసులు.. అక్కడకు వెళుతున్న టీడీపీ నేతలు.. కార్యకర్తల్ని మాత్రం అడ్డుకోవటం చూస్తే.. ఇదెక్కి పోలీసింగ్ అన్న సందేహం కలుగక మానదు.
గన్నవరంలో జరిగిన పరిణామాల్ని కళ్లకు కట్టినట్లుగా.. వంశీ అనుచరుల ఆరాచకాన్ని వీడియోలో రూపంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసినా పోలీసులు మాత్రం పెద్దగా స్పందించలేదు. దీనికి భిన్నంగా మాజీ మంత్రి.. టీడీకీకి చెందిన దేవినేని ఉమాను అరెస్టు చేశారు. ఘటనాస్థలానికి వెళ్లిన నిమిషాల్లోనే దేవినేని ఉమను అరెస్టు చేయటం ఒకటి అయితే.. ఉమాను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితి. దేవినేని ఉమాతో పాటు.. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కనిపించకుండా పోయారు. వంశీ వర్గీయుల దాడి నేపథ్యంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేందుకు గన్నవరం వెళ్లిన ఆయన ఆచూకీ మిస్ అయ్యింది. పోలీసు యూనిఫారంలో ఉన్న వ్యక్తి ఒకరు పట్టాభిని తీసుకెళ్లిన వైనాన్ని టీడీపీ శ్రేణులు గుర్తించాయి. పట్టాభిని తీసుకెళ్లింది ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆయన ఫోన్ స్విచాఫ్ లో ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తన భర్త ఆచూకీ తెలియజేయాలని పట్టాభి సతీమణి పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. పట్టాభి ఎక్కడ ఉన్నాడో చెప్పకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ఆమె వెల్లడించారు. పట్టాభి ఆచూకీ మిస్ కావటంపై టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.