తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం కారణంగా ఏపీకి జరిగే అన్యాయాన్ని నిలదీస్తూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు నగరంలో మూడు రోజుల దీక్ష చేస్తుండటం తెలిసిందే. మూడు రోజుల దీక్ష ఈ రోజు మొదలుకానుంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోతెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల ఏపీ ప్రజలకు తీవ్రఅన్యాయం జరుగుతున్నట్లుగా జగన్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలుకు ఉండే భావోద్వేగం ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బందికరంగా మారుతుందన్న భయం ఏపీ సర్కారును వెంటాడుతోంది.
కర్నూలులో జగన్ దీక్ష వ్యూహాత్మకమైనది చెప్పాలి. ఎందుకంటే.. భావోద్వేగాల పరంగా త్వరగా రియాక్ట్ అయ్యే తీరు కర్నూలు జిల్లావాసుల్లో ఎక్కువ. దీనికి తోడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉండటం.. పాలమూరు ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే జిల్లా కర్నూలుగా చెప్పొచ్చు. దీనికి తోడు మహబూబ్ నగర్ జిల్లాకు సరిహద్దుగా ఉండే కర్నూలు జిల్లాలో దీక్ష చేయటం ద్వారా భావోద్వేగాలు త్వరగా రగిలే అవకాశం ఉంది. దీనికి తోడు నిరసన దీక్ష మూడు రోజులు సాగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పడేస్తుందనే చెప్పాలి.
అందుకే.. జగన్ దీక్షకు ముందుగానే ఏపీ అధికారపక్ష నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ ఎవరిని మోసం చేయటానికి జలదీక్ష చేస్తున్నారో చెప్పాలంటూ ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నిస్తున్నారు. వైఎస్ చేసిన నిర్వాకం కారణంగా రాష్ట్రం నష్టపోయిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు మండుటెండల్లో నీరు.. ప్రగతి కోసం తిరుగుతుంటే.. జగన్ మాత్రం ఏసీల్లో ఉంటూ ఆర్నెల్లకోసారి దీక్ష పేరుతో హడావుడి చేయటానికి బయటకు వస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు.
పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టును తన నేతలకు ఇప్పించుకున్న జగన్.. విషయం బయటకు పొక్కగానే.. తమ ఎంపీని తెలంగాణ అదికారపక్షంలోకి చేర్పించేశారని మండిపడుతున్నారు. చంద్రబాబును పొగిడేస్తూ.. జగన్ ను తీవ్రంగా తిట్టేస్తున్న ఏపీ తమ్ముళ్ల మాటల్ని చూస్తే.. దీక్షకు వ్యతిరేకంగా ముందు నుంచే టోన్ పెంచి.. జగన్ దీక్ష ఉత్త రాజకీయ ప్రేరేపితమే తప్పించి మరొకటి కాదన్న వాదనను బలంగా వినిపించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోందనే చెప్పాలి.