ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కల నెరవేరలేదు. గత ఆరు నెలలుగా ఆయన పట్టిసీమ అని కలవరిస్తూనే ఉన్నారు. అది తన జీవిత కాల ధ్యేయమని, తన జీవితంలోనే అత్యంత సంతోషాన్ని ఇచ్చే సందర్భమని చెబుతూనే ఉన్నారు. దానిని ఘనంగా ప్రారంభించాలని, ఆ ఘట్టం చరిత్రలో నిలిచిపోవాలని కూడా కలలుగన్నారు. కానీ, చివరికి వచ్చేసరికి ఆయన దానిని ప్రారంభించలేకపోయారు. సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దానిని ప్రారంభించాల్సి వచ్చింది.
పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత దానిని ప్రారంభించడానికి చంద్రబాబు పడిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏ ప్రాజెక్టుకు అయినా కొన్ని పనులు ఉంటాయి. వాటిని చేయడానికి నిర్దిష్ట సమయం ఉంటుంది. ఆ సమయం వరకూ వాటిని పూర్తి చేయడం సాధ్యం కాదు. కానీ, పట్టిసీమను ఆరు నెలలు కూడా తిరక్కుండానే ప్రారంభించేయాలని ఆయన ఎందుకో హడావుడి పడిపోయారు. ఏడాది గడిచినా అది ఆయన క్రెడిట్టే అవుతుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహమూ ఉండదు. కానీ, అతి త్వరలోనే ఎన్నికలు వస్తున్నయేమో అన్నట్లు.. తన క్రెడిట్ ను ఎవరో తన్నుకుపోతారేమో అన్నట్లు చంద్రబాబు హడావుడి పడిపోయారు. ఫలితంగా, ఆగస్టు 15వ తేదీన ప్రాజెక్టు పూర్తి కాకుండానే దానిని జాతికి అంకితం చేసేశారు. మొదటి పంపు నిర్మాణం పూర్తి కాకుండానే దానిని ప్రారంభించేసి స్విచ్ ఆన్ చేయడానికి తెగ హడావుడి పడిపోయారు. తీరా ముహూర్తం పెట్టేనాటికి పంపుల నిర్మాణం కాస్త పూర్తి కాలేదు. దాంతో తాడిపూడి నుంచి వచ్చిన నీళ్లతోనే పవిత్ర సంగమాన్ని తూతూ మంత్రంగా మమ అనిపించారు.
ఆ తర్వాత రోజుకు పట్టిసీమ మొదటి పంపు పూర్తయినా.. అప్పటికీ సాంకేతిక లోపాలు వస్తూనే ఉన్నాయి. దాంతో అక్కడే ఉన్న మంత్రి దేవినేని ఉమానే దానిని ప్రారంభించాలని చెప్పారు. ఇంత హడావుడి పడినా, అంత ఆశ పడినా చంద్రబాబు దానిని ప్రారంభించలేకపోయారు.