రాజకీయాల్లో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు అదిరిపోతాయి. అవకాశం చిక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రత్యర్థులపై ఉంటుంది. ఒక్కసారి అవకాశం అంటూ.. చిక్కిందా.. నాయకులకు పండగే. ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేసుకుంటారు.
ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి దేవినేని ఉమా దెబ్బకు ఆయన విలవిల్లాడిపోతున్నారట.
నిజానికి .. గత ఎన్నికల్లో వసంత ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం వెనుక.. కమ్మ సామాజిక వర్గం.. ఆయనకు అన్నివిధాలా సహకరించింది. దీంతో టీడీపీ తరఫున దేవినేని గట్టి పోటీ ఇచ్చినా .. వసంత గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పటివరకు కమ్మ వర్గానికి వసంత చేసింది ఏమీలేదు. పైగా.. తనకు మంత్రి పదవి వస్తుందని.. చెబుతూ.. ఆయన వారిని నమ్మించారని.. కొందరు కమ్మ నాయకులు.. ఇటీవల ఆరోపించారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు పై.. కమ్మ వర్గం ఆగ్రహంతో ఉంది.
ఎందుకంటే.. అన్నగారు రామారావుకు.. మైలవరానికి దగ్గర సంబంధం ఉంది. ఆయన ఉమ్మడిజిల్లాలో ఉన్నప్పుడు.. ఇక్కడ సాగు చేశారని.. స్థానికులు ఇప్పటికీ చెప్పుకొంటారు.
ఇప్పటికీ..ఇక్కడ అన్నగారి కు టుంబానికి ఆస్తులు.. పొలాలు ఉన్నాయట. దీంతో మైలవరంలో అన్నగారంటే.. పడిచచ్చిపోయే ప్రజలు ఉన్నారనేది వాస్తవం. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రియాక్ట్ కాలేదని.. ఇక్కడ వారు.. ఒకింత అసహనంతో ఉన్నారు.
ఇదే ఇదే తడవుగా.. ప్రత్యర్థి.. దేవినేని ఉమా.. సోషల్ మీడియా వేదికగా.. వసంతను ఏకేస్తున్నారు. సోషల్ మీడియాలో వసంతను టార్గెట్ చేస్తూ.. ఇదే.. గతంలో అన్నగారు ఇచ్చిన పదవులు అనుభవించిన కుటుంబం ఇచ్చే మర్యాద, గౌరవం.. అంటూ.. ప్రశ్నిస్తున్నారు. దీంతో వసంతకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది. ఆయన ఇంటి నుంచి బయటకు కూడారావడంలేదని సమాచారం. మరికొందరు ఆయన ఇక్కడ లేరని.. ఎన్టీఆర్ సెగతో హైదరాబాద్‌కు వెళ్లిపోయారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.