పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో ఓ ఆగంతకుడు చొరబడి అపవిత్రం చేసేందుకు ప్రయత్నించగా.. భక్తులు ఆగ్రహించారు. ఏకంగా కొట్టి చంపారు. స్వర్ణ దేవాలయంలోకి గురుగ్రంథ్ సాహిబ్ ను అపవిత్రం చేసేందుకు ఆగంతకుడు ప్రయత్నించగా వెంటనే గుర్తించిన ఎస్.జీపీసీ సిబ్బంది దుండగుడిని పట్టుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్.జీపీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
అయితే అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న భక్తులు ఒక్కసారిగా దుండగుడిపై దాడి చేశారు. దీంతో ఈ దాడిలో ఆ ఆగంతకుడు మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దండగుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగంతకుడి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉంటుందని.. రేపు పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఆగంతకుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు కూడా పరిశీలిస్తున్నామని.. ఘటనపై భక్తులు , ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.