కాపులను బీసీలలో చేర్చాలని కోరుతూ పాదయాత్రకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు అనుమతి విషయంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు పరస్పర భిన్నమైన అభిప్రాయం ఇచ్చారు. హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ఇప్పటి వరకు అనుమతికి దరఖాస్తు చేయలేదని చెప్పారు. ఒకవేళ ఆయన తన పాదయాత్రకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని హోంమంత్రి వ్యాఖ్యానించారు. విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు.
కాగా, ఏలూరు రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు, ఇతర అంశాలపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మూడు జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ సాంబశివరావు సమావేశమయ్యారు. ముద్రగడ పాదయాత్ర అంశంపై కూడా విస్తృతంగా చర్చించారు. అనంతరం డీజీపీ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈపరిస్థితుల్లో యువతరం అప్రమత్తంగా ఉండి కేసుల్లో ఇరుక్కోకుండా భవిష్యత్ ను కాపాడుకోవాలని డీజీపీ సాంబశివరావు హితవు పలికారు. ముద్రగడ ఇంతకుముందు చేసిన ఆందోళనల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తటం తెల్సిందేనని, ఆ నేపధ్యంలో ఇప్పుడు ఆయన పాదయాత్రకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ పిల్లలు ఇలాంటి పాదయాత్రలో పాల్గొని భవిష్యత్ ను పాడుచేసుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు పోలీసులు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటారన్నారు.