తప్పుగా రాశారనుకోవద్దు. మీరు చదివింది కరెక్టే. కీలకమైన ఎన్నికల వేళ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోర్టుకు నోటీసులు ఇవ్వటం ఏమిటి? తెలుగు తమ్ముళ్లు ఫుల్ హ్యాపీగా ఉండటం ఏమిటన్న డౌట్ రాక మానదు. కానీ.. ఇది నిజం. అధినేతకు కోర్టు నోటీసులు ఇస్తే హ్యాపీగా ఫీల్ కావటం ఏమిటంటారా? ఇక్కడే అసలు విషయం ఉంది.
రాష్ట్ర విభజనకు ముందు.. మహారాష్ట్ర సర్కారు నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నాటి ఏపీ ప్రయోజనాలు దెబ్బ తింటాయంటూ నాటి విపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబు 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేయటాన్ని మర్చిపోకూడదు.
ఈ సందర్భంగా ఆయన బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టటం.. ఆ సందర్భంగా ఆయన ఆరెస్ట్ కావటం. తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు రానున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఒకట్రెండు రోజుల్లో ధర్మాబాద్ కోర్టు నుంచి బాబుకు నోటీసులు అందనున్నట్లుగా తెలుస్తోంది.
దీనిపై తాజాగా ఏపీ మంత్రి లోకేశ్ స్పందించారు. బాబుకు కోర్టు నోటీసులు ఇస్తే.. ధర్మాబాద్ కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం బాబు పోరాడినట్లుగా లోకేశ్ గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం జోరుగా ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన కోర్టు నుంచి నోటీసులు రావటం సానుకూలాంశమని.. ఇలాంటివేళ.. కోర్టుకు వెళ్లేందుకు బాబు నిర్ణయం తీసుకోవటం ద్వారా.. తెలంగాణ కోసం పోరాడిన ఇమేజ్ ను సొంతం చేసుకోవటంతో పాటు..తెలంగాణ ప్రజల మనసుల్ని దోచుకునే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. వామ్మో.. కోర్టు నోటీసుల్ని సైతం మైలేజీగా మార్చుకోవటం బాబుకే చెల్లుతుందేమో?