జడ్పీటీసీగా మంత్రి కొడుకు నామినేషన్.. జగన్ మాటతో విత్ డ్రా

Update: 2020-03-12 15:22 GMT
ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడు శ్రీకాకుళం జిల్లా పోలాకి జడ్పీటీసీ సభ్యుడిగా నామినేషన్ వేయడం వివాదాస్పదమైంది. దీంతో మంత్రి తన కుమారుడి తో నామినేషన్ ఉపసంహరింపజేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకుల బంధువులను వైసీపీ నుంచి బరిలో దించొద్దని సీఎం జగన్ సూచించడం తో ఆయన మాట ప్రకారం కుమారుడి నామినేషన్ వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని అన్నారు.

బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని అధిష్టానం చెప్పిందన్నారు. నా కుమారుడు కృష్ణచైతన్య వేసిన నామినేషన్‌ను రేపు విత్‌డ్రా చేసుకుంటాడని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి తీరాల్సిందేనన్నారు.

కాగా శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం సోదరుడి భార్య, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు... శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్ భార్య, టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పేరాడ తిలక్ భార్య కూడా స్థానిక ఎన్నికల బరిలో నిలిచారు. వారి నామినేషన్లూ వెనక్కు తీసుకోవాలని ఆయా స్థానాలను ఆశిస్తున్నవారి నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో వారంతా మంత్రి కుమారుడి మాటేమిటని ప్రశ్నిస్తుండడంతో కృష్ణదాస్ ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News