ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విరుచుకుపడుతున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి వ్యవహారంపై ఏపీ కేబినెట్ నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాద రావు తప్పు పట్టారు. వనజాక్షిదే తప్పని ఏపీ కేబినెట్ ఎలా చెబుతుందన్నారు. వనజాక్షి వ్యవహారంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్నారు. దర్యాఫ్తు జరుగుతుండగా కేబినెట్ వనజాక్షిది తప్పని చెబితే, దర్యాఫ్తు అధికారి ఏం చెబుతారన్నారు. దర్యాఫ్తు జరగకుండా ఆమెదే తప్పని చెప్పడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణం పైన సింగపూర్ సంస్థలతో ముందే చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో వ్యాపార ఉద్దేశ్యం తప్ప ప్రజా ప్రయోజనం లేదన్నారు. పుష్కరాల తొక్కిసలాట పైన కేబినెట్ మంత్రులే కేసును తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు. వనజాక్షి విషయంలో తప్పెవరిదో తేల్చాల్సింది ఆయనే కానీ ఏపీ మంత్రివర్గం కాదని.. మంత్రివర్గమే తప్పొప్పులు తేల్చేస్తే దర్యాప్తు అధికారి ఇంకెందుకని ఆయన మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.... వనజాక్షి కేసుతో ప్రభుత్వానికి మహిళల పైన గౌరవం లేదని తేలిపోయిందన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థిని చనిపోతే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిజాయితీగా పని చేసిన అధికారుల పైన, ప్రజల కోసం ప్రశ్నించే ప్రతిపక్షం పైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు.