24 అయితే ఏంటీ.. 40 అయితే ఏంటీ.. ఫిట్​నెస్​ పై ధోనీ కామెంట్స్​..!

Update: 2021-04-20 11:30 GMT
అంతర్జాతీయ క్రికెట్​ కు గుడ్​బై చెప్పిన మహేంద్రసింగ్​ ధోని.. ఐపీఎల్​ లో మాత్రం కొనసాగుతున్నాడు. సీఎస్​కే (చెన్నై సూపర్​కింగ్స్​ )కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత ఐపీఎల్​ లో ధోనీ సేన పెద్దగా రాణించలేదు. దీంతో ఈ జట్టుపై ముఖ్యంగా ధోనీపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ధోనీ ఫిట్​నెస్​ తో లేడని అతడు ఐపీఎల్​ నుంచి తప్పుకుంటే మేలని  కొందరు వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది ఐపీఎల్​ లో ధోనీ సేన వరస విజయాలు నమోదుచేస్తున్నది. దీంతో ఆ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఫిట్​నెస్​ పై ధోనీ మాట్లాడుతూ.. 'నాకు 24 ఏళ్లు ఉన్నా 49 ఏళ్లు ఉన్నా జట్టు విజయంపై భరోసా ఇవ్వలేను. ఎందుకంటే విజయం అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ధోనీ  అన్​ ఫిట్​ అన్న మాటలు మాత్రం నన్ను బాధిస్తుంటాయి. ధోనీ ఈ వయసులోనూ ఫిట్​నెస్​ తోనే ఉన్నాడు.. అని అభిమానులు ప్రేక్షకులు అంటే అదే చాలు నాకు' అంటూ ఇటీవల మహీ వ్యాఖ్యానించాడు.

రాజస్థాన్ రాయల్స్​ తో నిన్న జరిగిన మ్యాచ్​లో సీఎస్​కే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మొదటి ఇన్సింగ్స్​ లో ధోనీ రనౌట్​ కాకుండా ఓ అద్భుతమైన డైవ్​ చేశాడు. ఈ డైవ్​ అందరినీ ఆకట్టుకున్నది. ముఖ్యంగా ధోనీ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అయ్యారు. 'మహీ ఇంకా ఫామ్​ లోనే ఉన్నాడు ఎనీ డౌట్స్​' అంటూ కొందరు ధోనీ ఫ్యాన్స్ సోషల్​ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ జట్టులో రాజస్థాన్​ రాయల్స్​ ను ఇరుకున పెట్టేందుకు ధోనీ అద్భుతమైన ఫీల్డింగ్​ ను సెట్​ చేశాడు.అంతేకాక.. బౌలింగ్​ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసలు దక్కుతున్నాయి.
Tags:    

Similar News