ధోనీ. ఈ రెండు అక్షరాలు కోట్లాదిమందికి స్ఫూర్తి. ఈ జార్ఖండ్ డైనమెట్ సృష్టించిన సంచలనాలు అన్నిఇన్ని కావు. తన సారథ్యంలో టీమిండియాకు రెండోసారి ప్రపంచకప్‌ను సాధించాడు. తన జీవితంలో ఆరంభం నుంచి కష్టాల్ని.. అవమానాల్ని చూసిన అతగాడిలో ఒక కోణం అప్పటికి ఇప్పటికి మారలేదు. సంతోషానికి.. సాధించిన విజయాలకు పొంగిపోవటం.. అవమానాలకు కుంగిపోవటం లాంటివి ధోనిలో అస్సలు కనిపించవు.
ఇప్పటి జనరేషన్ జనాలు.. భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకునే విషయంలో చాలా చాలా పూర్ అన్నది తెలిసిందే. ఏదైనా కష్టం వచ్చినా.. సాధించింది కోల్పోయినా దాన్ని అంగీకరించటానికి.. మళ్లీ సాధించటానికి పోరాడే తత్త్వం చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ.. ధోనీ అందుకు భిన్నం. అందుకే ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీమిండియా కెప్టెన్ గా తనదైన ముద్ర వేసిన ధోనీ.. ఐపీఎల్ లోనూ కెప్టెన్ గా తన మార్క్ చూపించారు. ఐపీఎల్ 2017సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురై.. సాధారణ ఆటగాడిగా జట్టులో సాగుతున్నారు. టీమ్ యజమాని సంజీవ్ గోయెంకో సోదరుడు.. వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా ధోనీపై పరుష వ్యాఖ్యలు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ గ్రౌండ్ లో ఎలాంటి పరిస్థితుల్లోనూ భావోద్వేగానికి గురి కాకుండా.. కూల్ గా ఉండే ధోనీ.. తాజాగా ఐపీఎల్ యజమాని పరుష వ్యాఖ్యల విషయంలోనూ కూల్ గా ఉన్నట్లు చెబుతున్నారు.
కెప్టెన్ గా వ్యవహరించి.. అది పోగొట్టుకోవటం అంటే ఎంతో అవమానంగా ఫీలవుతారు. మూడీగా ఉంటారు. కానీ.. ధోనీ అందుకు భిన్నం. ఎప్పటిలానే సహచర ఆటగాళ్లతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్నారు. తాజా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత తన జట్టు ఆటగాళ్లతో ఉత్సాహంగా గడుపుతున్నారు ధోనీ. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఓ చిట్టి వీడియోను పోస్ట్ చేశాడు ధోనీ. అందులో ధోనీ.. అజింక్యా రహానెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఉంది.దీన్ని చూసినప్పుడు మనసుకు అనిపించేది ఒక్కటే.. జీవితంలో అప్ అండ్ డౌన్స్ కామనే. సానుకూలంగా ఉన్నప్పుడు ఎగిరిపడటం.. దెబ్బ తిన్నప్పుడు కుమిలిపోకుండా.. ధోనీ మాదిరి అన్ని వేళలా ఒకటేలా ఉండాలన్న మౌన సందేహాన్ని ఇచ్చినట్లుగా అనిపించక మానదు. ఇందుకుతగ్గట్లే ఈ చిట్టి వీడియో గంటల వ్యవధిలో లక్షల వ్యూస్ తో ఆదరిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/