టీమిండియా క్రికెట్ చరిత్రలో 2007, 2011 సంవత్పరాలు మరుపురానివి. ఆ రెండు సందర్భాల్లో టి20, వన్డే ప్రపంచ కప్ లు గెలిచింది భారత జట్టు. ఆ రెండుసార్లూ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఓపెనర్ గౌతమ్ గంభీర్. రెండు ఫైనల్స్ లోనూ గంభీర్ అద్భుత ఇన్నింగ్స్లులు (75, 97) ఆడాడు గంభీర్. అయితే, ధోని 2007 టి20 కప్ ఫైనల్స్ లో ఆరు పరుగులే చేసినా.. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో (91 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి విన్నింగ్ షాట్ గా సిక్సర్ కొట్టి చరిత్రలో నిలిచిపోయాడు. అయితే, ధోని, గంభీర్ మధ్య మరో సారూప్యత కూడా ఉంది. ఇద్దరూ దాదాపు ఒకే ఏడాది 2004లో టెస్టు జట్టులోకి వచ్చారు. 2004 నుంచి గంభీర్ పడుతూ లేస్తూ 2007 నాటికి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇక ధోని మాత్రం ప్రారంభంలో కొద్ది మ్యాచ్ ల్లో విఫలమైనా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మరోవైపు గంభీర్ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది. 2012 తర్వాత టి20 జట్టులో, 2013 అనంతరం వన్డే జట్టులో చోటుదక్కలేదు. టెస్టుల్లో మాత్రం 2016 వరకు కొనసాగాడు. కానీ,చివరి కొన్నేళ్లు నిరుత్సాహకర ప్రదర్శనే. పేలవ ఫామ్ తో జట్టుకు దూరమయ్యాడు.
విభేదాలు.. వివాదాలు
సహజంగానే గంభీర్ ది దూకుడు స్వభావం. బ్యాటింగ్ లోనూ అది కనిపిస్తుంటుంది. సహచర ఢిల్లీ ఆటగాడు, తర్వాత టీమిండియాలోనూ తనతో కలిసి ఆడిన విరాట్ కోహ్లితోనూ మైదానంలో ఓసారి గంభీర్ వాదనకు దిగాడు. కానీ, ధోనిది ప్రశాంత చిత్తం. అయితే, జట్టులో కొనసాగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒకేసారి జట్టులోకి వచ్చినవారు కావడం, ఒకే వయసు వారు కావడంతో పొసగినట్లు కూడా కనిపించేది కాదు. దీనికితోడు ధోని హయాంలో గంభీర్ తనకు పెద్దగా పేరు దక్కడం లేదని భావించినట్లు కనిపించేంది. అతడి వ్యాఖ్యలను చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. పైగా 2011 ప్రపంచ కప్ ఫైనల్లో మొదటి నుంచి గంభీర్ అద్భుతంగా ఆడి పునాది వేయగా, చివర్లో ధోని వచ్చి క్రెడిట్ అంతా కొట్టేసినట్లు కనిపించింది. అయితే, ఇదంతా ఊహాగానమే.వాస్తవం ఏమిటనేది ఆ ఇద్దరు క్రికెటర్లూ చెప్పలేదు. జట్టులోని విషయం బయటకు పొక్కలేదు.
గంభీర్ 2016లో చివరి టెస్టు ఆడి రిటైరయ్యాడు. 2019 ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి గెలిచి ఎంపీ అయ్యాడు. అదే ఏడాది అతడికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇక ధోని 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 2020 ఆగస్టు 15న వీడ్కోలు పలికాడు. 2104లో చివరి టెస్టు ఆడాడు. కాగా, గంభీర్.. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ను రెండు సార్లు అండగా నిలిచే మొదటి వ్యక్తిని నేనేనంటున్న గంభీర్ రెండుసార్లు చాంపియన్ గా నిలిపాడు. చెన్సై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని ఆ జట్టుకు నాలుగుసార్లు కప్ అందించాడు.
తాజాగా ధోనితో విభేదాలపై గంభీర్ మాట
బయట ఎవరెన్ని అనుకున్నా.. తాజాగా ‘ధోనికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు’అంటూ ప్రకటన చేశాడు గంభీర్. ‘‘ధోనీకి ఎప్పుడైనా, ఏదైనా అవసరమైతే, అతని పక్కన నిలబడే మొదటి వ్యక్తి నేనే. అతను భారత క్రికెట్‌కు ఏం చేశాడో నాకు తెలుసంటూ..’’ పేర్కొన్నాడు. ధోనీకి ఎలాంటి అవసరం వచ్చినా, నేనే ముందుగా ఉంటానని, ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ప్రకటించాడు.
‘మహేంద్ర సింగ్ ధోనీ అంటే నాకు చాలా గౌరవం, ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. నేను దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పగలను. అవసరమైతే 138 కోట్ల మంది ప్రజల ముందు కూడా చెప్పగలను’ అంటూ చెప్పుకొచ్చాడు.‘ధోనీకి ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే, అతని పక్కన నిలబడే మొదటి వ్యక్తి నేనే. అతను భారత క్రికెట్‌కు ఏం చేశాడో నాకు తెలుసు. మనిషిగా కూడా చాలా చేశాడు’అంటూ వివరణ ఇచ్చాడు. తద్వారా ధోనికి తనకు మధ్య విభేదాలు లేవని కుండబద్ధలు కొట్టాడు. గంభీర్ ఏప్రిల్ 2003లో టీమ్ ఇండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. సుమారు 15 ఏళ్ల కెరీర్ తర్వాత, గంభీర్ డిసెంబర్ 2018లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. గంభీర్ తన కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. ఈ సమయంలో అతను టెస్టుల్లో 4154 పరుగులు, వన్డేల్లో 5238 పరుగులు చేశాడు. కాగా, టీ20 క్రికెట్‌లో గంభీర్ పేరిట 932 పరుగులు ఉన్నాయి.