వైజాగ్ కి శుభవార్త..క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్న ఎం.ఎస్ ధోనీ !

Update: 2019-12-26 11:56 GMT
విశాఖపట్నం గత కొద్దీ రోజులుగా ఈ  నగరం పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతి నుండి రాజధానిని విశాఖకు తరలించబోతున్నారు అన్న సంకేతాలు వెలువడుతుండటం అందరి దృష్టి ఇప్పుడు వైజాగ్ పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా మారడానికి సిద్ధంగా ఉన్న విశాఖపట్నం లో పెట్టుబడులు పెట్టడానికి కూడా పెద్ద పెద్ద కంపెనీ లు ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే నిజానికి  విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌ లో కాస్మోపాలిటన్ సంస్కృతిని కలిగి ఉన్న ఏకైక నగరం. అలాగే    హైదరాబాద్ తరువాత రాజధాని నగరానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉన్న నగరం కూడా వైజాగే. కానీ , గత ప్రభుత్వం కృష్ణ మరియు గుంటూరు జిల్లాలకు కాస్మోపాలిటన్ సంస్కృతి లేనప్పటికీ  అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎన్నుకుంది. కానీ , తాజాగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వై ఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖపట్నంని  కార్యనిర్వాహక రాజధానిగా మార్చాలని నిర్ణయించడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ ఓడరేవు నగరం పై పడింది.

ఈ నేపథ్యంలోనే ..భారత క్రికెట్ మాజీ కెప్టెన్ - స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని విశాఖపట్నంలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ధోని చాలా నెలల క్రితం విశాఖపట్నంలో ప్రైమ్ భూమిని కొన్నాడు. అక్కడే ధోని తన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ధోని విశాఖలో అకాడమీ  పెడతా అని ముందుకి వస్తే  రాష్ట్ర ప్రభుత్వమే క్రికెట్ అకాడమీకి కావాల్సిన భూమిని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ - ధోని ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా అకాడమీకి కావాల్సిన భూమి కోనట్టు తెలుస్తోంది.

అలాగే ,టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ కూడా విశాఖపట్నంలోని భీమిలి ప్రాంతంలో ఒక ప్రైమ్ ల్యాండ్ కోనట్టు సమాచారం. త్వరలో వైజాగ్ రాజధాని నగరంగా మారబోతున్నందున - తమన్ అక్కడ తన సొంత స్టూడియోని నిర్మించడానికి  ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. థమన్ కి ఇప్పటికే చెన్నై మరియు ముంబైలలో తన సొంత స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు,కొత్తగా భీమిలిలో  స్టూడియో నిర్మిస్తే ..తమన్ కి ఇది మూడో స్టూడియో అవుతుంది. అలాగే ఇప్పటికే వైజాగ్ బీచ్ రోడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ కి స్టూడియో ఉంది. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్ లో మిగిలిన సెలెబ్రెటీలు కూడా మరికొన్ని స్టూడియోలు నిర్మించే అవకాశం లేకపోలేదు.


Tags:    

Similar News