షార్జా వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పసందైన విందు పంచింది. చివరికి రాజస్థాన్ కు విజయం వరించినా చెన్నై కూడా చివరి దాకా పోరాడింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీ ఈ మ్యాచ్ లో అంపైర్ తో వాగ్వాదానికి దిగడం ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ధోనీ వైఫ్ సాక్షి కూడా అంపైర్ల తీరుపై మండి పడుతూ ట్వీట్ చేసింది. 'ఒకసారి ఔట్ అంటే అది ఔటేనంటూ' అంపైర్ల నిర్ణయాన్ని తప్పు పడుతూ ట్వీట్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరలై వివాదంగా మారడంతో దానిని డిలీట్ చేసింది.
అసలేం జరిగిందంటే
మ్యాచ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చెన్నై బౌలర్ దీపక్ చాహర్ బంతి విసరగా అది టామ్ కుర్రమ్ ప్యాడ్ లను తాకుతూ వెళ్లి కీపర్ ధోనీ చేతికి చిక్కింది. వెంటనే అంపైర్ ఔట్ గా ప్రకటించడంతో టామ్ పెవిలియన్ దిశగా వెళ్ళాడు. అంతలో స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లలో బాల్ ఒక పిచ్ పడి ధోనీ చేతిలో పడ్డట్లు రీప్లేలో చూపించింది. పైగా బాల్ కూడా బ్యాట్ ను తాకలేదు. అందుకే దానిని అంపైర్లు ఎల్బీడబ్ల్యూగా పరిగణించలేదు. వెంటనే టామ్ కుర్రమ్ ని వెనక్కి పిలిపించి బ్యాటింగ్ కొనసాగించారు.
దీంతో టామ్ కడదాకా నాటౌట్ గా నిలిచి జట్టు భారీ స్కోర్ సాధించడంలో తన వంతు సాయం చేశాడు. ఇది చెన్నై విజయంపై ప్రభావం చూపింది. అంపైర్లు నిర్ణయంపై ధోనీ కూడా మండిపడ్డాడు. వారితో కాసేపు వాగ్వాదం చేశారు. ఈ ఎపిసోడ్ పై అంపైర్ల నిర్ణయాన్ని సాక్షి ధోని తప్పు పట్టింది. 'టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలని, ఒకసారి ఔట్ అంటే అది ఔటేనని ' పేర్కొంది. అయితే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో పెద్ద దుమారం రేగింది. వెంటనే సాక్షి ఈ ట్వీట్ ని డిలీట్ చేసినా..ఆ ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దాన్ని వైరల్ చేశారు. అంపైర్లను విమర్శించడం తగదంటూ సాక్షిపై విమర్శలు చేశారు.