పొలం దున్నుతుంటే కోటి విలువైన వజ్రం దొరికింది..!

Update: 2020-05-22 10:10 GMT
కలిసిచ్చే కాలం ఉంటే ఎక్కడ ఉన్నా అదృష్టం వెతుక్కుంటూ వస్తుందంటారు. ప్రస్తుతం అందరూ ఈ వైరస్ కారణంగా కష్ట కాలంలో ఉంటె ఒక రైతుకు అదృష్టలక్షి వజ్రం రూపంలో ఎదురుగ నడుచుకుంటూ వచ్చింది. ఇటీవల కర్నూలు జిల్లాలో గొర్రెల కాపరికి , అలాగే ఒక వ్యవసాయ కూలీకి వజ్రాలు దొరికాయి. ఇక తాజాగా అనంతపురం జిల్లాలో ఒక రైతు పంట పడింది . పొలంలో కోటి రూపాయల విలువైన వజ్రం దొరికింది.

నాలుగు రోజుల క్రితం ఓ రైతుకు విలువైన వజ్రం దొరికిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులో ఊటకల్లుకువెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ మధ్య కురిసిన వర్షానికి భూమి పదును కావడంతో రైతులు సేద్యం పనులు మొదలు పెట్టారు . రైతు దుక్కి దున్నుతున్న సమయంలో వజ్రం తళుక్కుమంది. దీనితో గ్రామంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి కర్నూల్‌ జిల్లాలో పెరవలిలో విక్రయించేందుకు ప్రయత్నించంగా రేటు కుదరలేదు.

దాంతో మరో వ్యాపారికి దగ్గర విక్రయించేందుకు వెళ్లాడు. గుత్తి ఆర్ఎస్ వ్యాపారి దాన్ని రూ.30 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే ఆ వజ్రం ధర కోటి రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తొలకరి సీజన్ లో అనంతపురం , కర్నూలు జిల్లాలలో వజ్రాల వ్యాపారులు స్థానిక ప్రజలను మోసం చేస్తూ అతి తక్కువ ధరలకు అత్యంత విలువైన వజ్రాలను కొనుగోలు చెయ్యటం పరిపాటిగా మారింది.
Tags:    

Similar News