హిట్ లిస్ట్‌ లో తొలి పేరు గిరీష్ కర్నాడ్!

Update: 2018-07-26 05:13 GMT
గిరీష్ కర్నాడ్.. నాటక రచయిత... నటుడు... సినీమాల్లో కూడా నటించిన ఔరా అనిపించుకున్న బహుముఖ ప్రతిభావంతుడు. తెలుగు సినిమా ఆనంద భైరవిలో నటించిన గిరీష్ కర్నాడ్‌ కు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది అభిమానులున్నారు. అంతటి ప్రతిభా మూర్తిని మట్టుపెట్టాలని దేశంలో కొన్ని హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. గత సంవత్సరం రచయిత్రి - సంపాదకురాలు గౌరీ లంకేష్ ను హతమార్చిన వారే గిరీష్ కర్నాడ్‌ ను కూడా చంపాలనుకుంటున్నట్లు తాజా వెల్లడైంది.  గౌరీ లంకేష్‌ ను కాల్చి చంపిన వారిలో కొందరిని రెండు నెలల క్రితం ప్రత్యేక దర్యాప్తు సంస్ధ అధికారులు అరెస్టు చేశారు. వీరిని ప్రశ్నిస్తున్న సమయంలో వారి నుంచి అధికారులు ఎంతో సమాచారం సేకరించారు.

దీంతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ డైరీలో కర్నాటక - మహరాష్ట్రలకు చెందిన 37 మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరందరూ హిందుత్వకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేపిన వారే కావడం విశేషం. ఈ హిట్ లిస్టులో ఉన్న వారిలో తొలి పేరు గిరీష్ కర్నాడ్‌ ది కావడం విశేషం. హిందూత్వ శ‌క్తులు హ‌త‌మార్చాల‌నుకున్న వారి జాబితాలో ప్రముఖ న‌టుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉండ‌డం సంచ‌ల‌నం రేపింది. ముందుగా గిరీష్ కర్నాడ్‌ ని చంపాలని నిందితులు భావించారు. ఆ తర్వాత గౌరీ లంకేష్‌ ను  - రాజకీయ నాయకుడు లలితా నాయక్ - మఠాధిపతి వీరభద్ర చెన్నమల స్వామి - హేతువాది ద్వారకానాథ్‌ లను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ డైరీలో ఉండడం విశేషం. అయితే గిరీష్ కర్నాడ్ కోసం వేసిన ఫలించకపోవడంతో ముందుగా ఆయన స్థానంలో గౌరీ లంకేష్‌ ను హత్య చేశారు హిందుత్వ వాదులు. ఈ నెల 23 వ తేదీన సిట్ అధికారులు అరెస్టు చేసిన రాజేష్ డీ బంగేరా వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు ఉండడం గమనార్హం. గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితులకు - తమకు ఎలాంటి సంబంధం లేదంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేర్కొనడం కొసమెరుపు.


Tags:    

Similar News