ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకి చిగురుటాకులా వణికిపోతోంది. ఈ కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా సోకింది. అలాగే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 53,292 మంది మృతిచెందారు. కరోనా ప్రభావం రోజురోజుకి పెరిగి పోతుండటం, అలాగే మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలలో ఆందోళన మొదలైంది. ఇకపోతే ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చింది. చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ దేశాన్ని కూడా అతలాకుతలం చేసింది.
అయితే, ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కేవలం 81 వేలమంది మాత్రమే ఈ వైరస్ బారిన పడ్డారు. 3,322 మంది మరణించారు. ఇది చైనా అధికారికంగా ప్రకటించిన కరోనా కేసుల సంఖ్య అలాగే కరోనా మరణాల సంఖ్య. కానీ, అసలు సంఖ్యను చైనా దాచి పెడుతున్నట్టు ప్రపంచదేశాలు చైనా పై మండిపడుతున్నాయి. దాదాపుగా 150 కోట్ల మంది జనాభా ఉన్న చైనా దేశంలో కరోనా మహమ్మారి 80 వేలమందికి మాత్రమే సంక్రమించింది అని చెప్పడాన్ని ఏ దేశం కూడా నమ్మే స్థితిలో లేదు.
అయితే, చైనాలోని దాదాపుగా రెండు కోట్ల మందికి సంబంధించిన ఫోన్లు పనిచేయడం లేదని, వారంతా ఏమయ్యారు అనే దానిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. చైనా ఈ వైరస్ పై ఇప్పటికే విజయం సాధించింది. చైనా లో మళ్లీ సాధారణ స్థితులు వచ్చేసాయి. అయినప్పటికీ కూడా కరోనా వైరస్ కు సంబంధించిన విషయాలను దాచిపెడుతూనే ఉన్నది. వైరస్ ఎంతమందికి వ్యాపించింది, ఎంత మంది మరణించారు అనే వాస్తవ విషయాలను ఇప్పటికి దాచిపెట్టడం వెనుక ఉద్దేశం ఒక్క చైనాకే తెలియాలి.