అంత స్పీడుగా వెళ్లాడా? కారులోంచి దూకేసాడు.. పంత్ యాక్సిడెంట్ వీడియో వైరల్

Update: 2022-12-30 06:57 GMT
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాద దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. అతివేగంగా ప్రయాణిస్తున్న అతడి బీఎండబ్ల్యూ కారు రోడ్డుపక్కనే ఉన్న రెయిలింగ్ ను ఢీకొట్టింది. 30 మీటర్ల రెయిలింగ్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ వెంటనే కారు పూర్తిగా దగ్ధమైంది.

పంత్ ప్రమాదం జరగగానే కారును తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పంత్ నే కారు నడిపినట్లు సమాచారం. ప్రమాదం జరగగానే కొందరు వాహనదారులు ఆగి పంత్ ను డివైడర్ పై పడుకోబెట్టారు. పంత్ ప్రమాద దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా రిషబ్ పంత్ కారు డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వీడియో సీసీటీవీ కెమెరాకు చిక్కింది. కొందరు స్థానికులు ఈ ఘటనను వీడియో తీశారు.  హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. రిషబ్‌ను హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. అతడికి ప్లాస్టిక్ సర్జరీ అక్కడే చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

రిషబ్ పంత్ నుదుటిపైన, కాలికి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని, అతడిని రూర్కీ నుంచి ఢిల్లీకి రిఫర్ చేస్తున్నట్లు సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు. అక్కడ అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేయనున్నారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రిషబ్ కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది, ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద మంటలు అదుపులోకి వచ్చాయి. అదే సమయంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రిలో చేర్పించారు.పంత్ తన బిఎమ్‌డబ్ల్యూ కారును నడుపుతున్నాడని, అది ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురైందని ప్రాథమిక నివేదికలు తెలిపాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News