ప్రపంచమంతా కరోనా గురించి.. తాజాగా వస్తుందని అంచాన వేస్తున్న థర్డ్ వేవ్ గురించి హాట్ హాట్ గా చర్చలు జరుపుతున్న వేళలో.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కొన్ని వర్గాల్లో అందుకు భిన్నమైన వాతావరణం గురువారం కనిపించింది. మీడియాతో పాటు రాజకీయ వర్గాలు.. రియల్ ఎస్టేట్ సంస్థల వారితో పాటు.. పలువురు కోకాపేటలో హెచ్ఎండీఏ వేలం వేస్తున్న 49 ఎకరాలు ఎంత ధర పలుకుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది. చివరకు సీఎంవో సైతం ప్రత్యేకంగా ఈ అంశంపై ఫోకస్ పెట్టటం.. ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవటం విశేషం.
తమకు అందిన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం నోట్ రూపంలో పంపినట్లుగా చెబుతున్నారు. హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న వేలం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు తెలియజేయాలంటూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. వేలం విషయంలో సీఎం కేసీఆర్ ఇంత ఆసక్తి వ్యక్తం చేయటానికి కారణం.. రాష్ట్ర ఖజానాకు ఏ మేరకు ఆదాయం వస్తుందన్న విషయంతో పాటు.. రానున్న రోజుల్లో భూముల అమ్మకాలు రాష్ట్ర ఆదాయాన్ని భారీగా పెంచటంతో పాటు.. రియల్ ప్రపంచంలో తెలంగాణ ముఖచిత్రం పూర్తిగా మారుతుందన్న అంచనానే ఈ ప్రత్యేక ఆసక్తికి కారణమని చెబుతున్నారు.
వేలం జరుగుతుందన్న విషయాన్ని మాత్రమే మీడియా చూపించింది. అంతకు మించిన వివరాలేమీ రాత్రి ఎనిమిదిన్నర వరకు ప్రసారం చేయలేదు. ముందుగా ఒక మీడియా సంస్థ మాత్రం జోరుగా వేలం సాగుతున్నట్లుగా పేర్కొంటూ.. రికార్డు స్థాయిలో బిడ్లు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు కానీ.. అవేమీ కూడా హెచ్ఎండీఏ సంస్థ అధికారికంగా పేర్కొన్న గణాంకాలతో పెద్దగా మ్యాచ్ కాలేదు.
చివరకు వేలం వివరాల్ని ప్రెస్ నోట్ రూపంలో వెల్లడించటం.. టీవీల్లో భారీ ఎత్తున బ్రేకింగ్ న్యూస్ లంటూ కుమ్మేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కోకాపేట వేలంలో సరాసరిన పలికి ఎకరం భూమి విలువ రూ.40 కోట్లు మాత్రమే కానీ.. 1.67 ఎకరాల ఫ్లాట్ ఒకటి ఎకరం రూ.60 కోట్ల మేర బిడ్ వేయటంతో అందరి చూపు దాని మీదే పడింది. అందరికి హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి మరో బిట్ కేవలం ఎకరం మాత్రమే ఉన్న భూమి పలికిన ధర రూ.31.2 కోట్లు మాత్రమే. ఆ మాటకు వస్తే.. నిన్న జరిగిన వేలంలో కనిష్ఠంగా ధర పలికిన ఫ్లాట్ ఇదే కావటం గమనార్హం. కానీ.. దాని కంటే కూడా రికార్డు స్థాయిలో కోట్ చేసిన 1.67 ఎకరాల బిట్ మీడియాలో హైలెట్ అయ్యింది.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. 1.67 ఎకరాల్ని ఎకరం రూ.60 కోట్ల ఫ్యాన్సీ ధరను కోట్ చేసిన సంస్థ (రాజపుష్ప).. ఉదయం జరిగిన సెషన్ లో 7.72 ఎకరాల్ని ఎకరం రూ.42.2 కోట్లు మాత్రమే కోట్ చేసి సొంతం చేసుకోవటం గమనార్హం. నిజానికి నిన్న జరిగిన ఎనిమిది ఫ్లాట్ల వేలంలో మూడు ఫ్లాట్లు మాత్రమే (60.2 కోట్లు, రూ.42.4 కోట్లు, రూ.42.2 కోట్ల) రూ.40 కోట్ల కంటే ఎక్కువ ధర పలికాయి. మిగిలిన ఐదు ప్లాట్ల ధర ఎకరం రూ.40 కోట్ల కంటే తక్కువగా అమ్ముడు కావటం గమనార్హం. ఉదయం సెషన్ తో పోలిస్తే.. సాయంత్రం సెషన్ లోనే ధరలు తక్కువగా కోట్ అయ్యియి. కాకుంటే.. 1.67 ఎకరాల ఫ్లాట్ ను రూ.60.2 కోట్లు చొప్పున కోట్ చేయటంతో.. అదే హాట్ టాపిక్ గా మారి.. అందరూ దాని గురించే మాట్లాడుకునేలా చేసిందని చెప్పక తప్పదు.