తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దానికి నిదర్శనంగా ఇటీవల చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి చెబుతున్నరు. కరోనా కారణంగా వ్యవస్థలు మొత్తం చేష్టలుడిగిపోయినట్లుగా మారటమే కాదు.. కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. చిన్న విషయాలకు సైతం.. సామాన్యులకు ఎదురవుతున్న కష్టాలు మరీ ఇంత ఎక్కువగా ఉన్నాయా? అన్న సందేహం కలిగే పరిస్థితి నెలకొంది. ఆర్మీలో కల్నల్ గా వ్యవహరించే వ్యక్తి.. తన తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం ఏకంగా ఒక యుద్ధమే చేయాల్సి వచ్చిందన్న వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
జీహెచ్ఎంసీ పని తీరుపై పలు సందేహాలు వ్యక్తమయ్యేలా చేయటమే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో చిన్న విషయాలకు సైతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొందా? అన్న విస్మయానికి గురి చేసేలా తాజా ఉదంతం ఉందని చెప్పాలి. సికింద్రాబాద్ లోని సైనిక్ పురిలో 84 ఏళ్ల సత్యబ్రత దాస్ గుప్తా నివసిస్తుంటారు. ఈ మధ్యనే ఆయన మరణించారు. ఆయన కుమారుడు కల్నల్ జాయ్ దాస్ గుప్తా జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తుంటారు.
ఒక బెటాలియన్ కు కమాండింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఆయన.. తన తండ్రి అంతిమ సంస్కారాల కోసం ఈ మధ్యన నగరానికి వచ్చారు. కరోనా నేపథ్యంలో తండ్రి అంత్యక్రియల్ని పూర్తి చేయటానికి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతా అయ్యాక.. తన తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. తొమ్మిదో తేదీన ఖననం తర్వాతి రోజున అంటే మే పదిన నేరెడ్ మెట్ శ్మశానానికి వెళ్లారు. ఇటీవల మరణాలు పెరిగిపోయాయని.. రశీదు పుస్తకాలు అయిపోయాయని.. కొత్త పుస్తకాలు జీహెచ్ఎంసీ నుంచి రాలేదని చెప్పారు. దీంతో.. ఈ విషయాన్ని యాప్ లో కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసినా.. పరిష్కారం కాలేదు.
దీంతో.. జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి వెళ్లాలన్న సూచనతో ఆయన అక్కడకు వెల్లారు. అయినప్పటికి పని పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో కల్నల్ కు బాగా తెలిసిన ఒక మీడియా వ్యక్తి.. సదరు విషయాన్ని ట్వీట్ రూపంలో పోస్టు చేశారు. దీంతో స్పందించిన మంత్రి కేటీఆర్.. అధికారులతో ఫోన్ లో మాట్లాడటంతో డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. మరణ ధ్రువీకరణ పత్రం కోసం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద యుద్ధం చేయాల్సి రావటమా? అని సదరు కల్నల్ వాపోయే పరిస్థితి. ఇలాంటి దుస్థితి గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసా? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి.