కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన పోలింగ్ లో మల్లికార్జున ఖర్గేకే తెలంగాణాలో నూరుశాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. అధ్యక్షపదవికి ఖర్గేతో పాటు శశిథరూర్ పోటీచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 17వ తేదీన జరిగిన పోలింగ్ ఫలితాలు 19వ తేదీ అంటే బుధవారం ప్రకటిస్తారు. పోలింగుకు వీలుగా దేశవ్యాప్తంగా 65 చోట్ల ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సులన్నింటినీ పార్టీ ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన వారు ఢిల్లీకి చేరవేస్తున్నారు.
సరే ఇక ఫలితం విషయాన్ని చూస్తే తెలంగాణాలో 241 ఓట్లున్నాయి. ఇందులో 226 మంది పీసీసీ ప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరి మిగిలిన 15 మంది ఎందుకు ఓట్లు వేయలేదో తెలీటంలేదు. పోలైన 226 ఓట్లలో దాదాపు ఖర్గేకి అనుకూలంగానే పడినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
అలాగే ఏపిలో 350 ఓట్లుంటే 303 మంది ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. ప్రచారం సమయంలోనే ఇద్దరిలో రాష్ట్రం ఎవరికి అనుకూలంగా ఉందనే విషయం తేలిపోయింది. థరూర్ ప్రచారానికి వచ్చినపుడు సీనియర్ నేతలెవరూ పెద్దగా సహకరించలేదు.
తర్వాత ఖర్గే వచ్చినపుడు మాత్రం సీనియర్లు కలవటానికి పోటీలు పడ్డారు. ఖర్గేకి సోనియాగాంధీ ఆశీస్సులున్నాయనే ప్రచారం కారణంగానే థరూర్ ను చాలామంది దూరం పెట్టేశారు. బహుశా తెలంగాణాలో ఓటుహక్కును వినియోగించుకోని నేతలు 15 మంది ఖర్గేకి వేయటం ఇష్టంలేక రాలేదా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్నది అర్ధం కావటంలేదు.
తెలంగాణాలో పోలైన ఓట్లసరళిని బట్టి చూస్తే మిగిలిన రాష్ట్రాలో కూడా ఖర్గేకి అనుకూలంగానే పోలైనట్లు అర్ధమవుతోంది. మొత్తం పోలైన 96 శాతం ఓట్లలో సుమారు 90 శాతం ఓట్లు ఖర్గేకే అనుకూలంగా పడినట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి. సరే ఎన్నిక ఎవరికి ఏకపక్షంగా జరిగింది, ఎవరు ఓడిపోయారన్నది అప్రస్తుతం. ఇక్కడ చూడాల్సిందేమంటే అధ్యక్షపదవికి ఎన్నిక 22 ఏళ్ళ తర్వాత జరగింది. అలాగే గాంధీ కుటుంబేతర నేత చేతిలోకి పార్టీపగ్గాలు వెళ్ళబోతున్నది. ఫలితం తర్వాత పార్టీ భవిష్యత్తు ఎలాగుంటుందో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.