తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఏ తప్పు అయితే చేశారో.. తన విషయం లో అలాంటిది ఎప్పటికి జరగకూడదన్న విషయంలో తమ్ముడు పవన్ కల్యాణ్ ఎప్పుడు అలెర్ట్ గా ఉంటారని చెబుతారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన కారణంగా.. తమ విశ్వసనీయత విషయం లో ప్రజల్లో ఉన్న సందేహాలకు మరింత బలం చేకూరేలా తన రాజకీయ నిర్ణయాలు అస్సలు ఉండకూడదన్న కాంక్ష పవన్ లో ఎక్కువేనని.. ఆయన సన్నిహితులు తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతుంటారు.
ఒక రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేసి.. మరో పార్టీలోకి విలీనం చేయటం తప్పు ఎంతమాత్రం కాకున్నా.. విలీనం చేసిన విధానం మీదనే అభ్యంతరమని చెప్పాలి. ప్రజారాజ్యం విషయంలో చిరు తీసుకున్న నిర్ణయాన్నే చూస్తే.. మూడో కంటికి తెలీకుండా గుట్టు చప్పుడు కాకుండా నిర్ణయం తీసుకోవటాన్ని తప్పు పడతారే కానీ.. కాంగ్రెస్ లో కలిపేసినందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు.
ఏ పరిస్థితుల్లో అయితే పార్టీ పెట్టారన్న విషయం మీద బహిరంగ సభ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చిన చిరు.. పార్టీని ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి విలీనం చేస్తున్నామన్న విషయాన్ని భారీ బహిరంగ సభను పెట్టకున్నా.. కనీసం ఒక ప్రెస్ మీట్ ను పెట్టి ప్రజలకు స్పష్టత ఇచ్చినా బాగుండేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయంలో తమ్ముడు పవన్ కూడా ఇదే తరహా అభిప్రాయంతో ఉంటారని చెబుతారు.
ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయం లో తన అన్నతో తమ్ముడు పవన్ విబేధించినట్లుగా చెబుతారు. ఈ విషయం ఇలా ఉంటే.. తాజాగా తాను రాజకీయాలు చేస్తూనే.. సినిమాలు కూడా చేయాల్సి వచ్చిన పరిస్థితుల్ని వివరించి.. సినిమాలకు ఓకే చెబితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. పార్టీ నుంచి వీడిపోతూ జేడీ లక్ష్మీనారాయణ చేసిన విమర్శల్లో పస లేనప్పటికీ.. మొన్నటివరకూ తాను సినిమాలు చేయనని ఎందుకు చెప్పింది? తాజాగా ఒకటికి రెండు సినిమాలకు ఓకే ఎందుకు చెప్పిందన్న విషయంపై ప్రజలకు క్లారిటీ ఇచ్చి ఉంటే అనవసరమైన విమర్శలకు అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయం ఉంది.
ఎన్నికల్లో పార్టీ గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం పవన్ ను అందరూ అభినందిస్తారు. ఎన్నికల్లో మిగిలిన రాజకీయ పక్షాలకు భిన్నంగా.. ఎక్కడా కూడా ఓట్ల కోసం రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వని తీరును పలువురు అభినందిస్తారు. కాకుంటే.. ఈ విషయం పెద్ద గా ప్రచారం కానప్పటికీ.. ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు మొత్తం కూడా అభిమానంతో వేసినవే తప్పించి.. డబ్బు.. ఇతర ప్రలోభాలతో కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇలా విలువల విషయంలో రాజీ పడకుండా ఉన్న పవన్ గురించిన విషయాలు మీడియా లో ఫోకస్ కాకుండా పోవటం కూడా ఆయన్ను దెబ్బ తీసిందని చెప్పాలి. ప్రజారాజ్యం విషయం లో తెలుగు ప్రజలకు ఏ మాత్రం క్లారిటీ ఇవ్వకుండా కాంగ్రెస్ లో విలీనం చేసే విషయం లో చిరు చేసిన తప్పు లాంటిదే సినిమాల్లో మళ్లీ నటించాలన్న నిర్ణయాన్ని తనకు తానే ప్రజలకు వెల్లడించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. ఈ లెక్కన తన అన్న చేసిన తప్పు నుంచి తమ్ముడు ఎలాంటి పాఠం నేర్చుకోలేదా? అన్న సందేహం కలుగక మానదు.