కరోనా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కాస్త సీరియస్ గానే ఉంది. దీన్ని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. వ్యాక్సిన్ కూడా ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సర్కారు.. ఆ మేరకు వేగంగా ప్రయత్నాలు చేపడుతోంది. అయితే.. వ్యాక్సిన్ విషయంలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యహారశైలి దుమారం చెలరేగడంతో.. సీఎంవో నుంచి అక్షింతలు పడినట్టుగా ప్రచారం సాగుతోంది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే షేక్ రాజా ఆసుపత్రిలో కూడా ఓ వ్యాక్సినేషన్ కేంద్రం ఉంది. ఇది నగర ప్రజలకు మాత్రమే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా అనువుగా ఉంది. ఇక్కడ వ్యాక్సినేషన్ చక్కగానే నడుస్తోంది.
అయితే.. ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఓ మంత్రి తన నియోజకవర్గాన్ని తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. అక్కడ మౌలిక సదుపాయలు పెద్దగా లేవట. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారని, మీడియాలో ఫొటోలతో సహా వార్తలు రావడంతో.. ఈ విషయం సీఎం వద్దకు వెళ్లినట్టు సమాచారం.
స్పందించిన జగన్.. సీఎంవో ద్వారా సదరు మంత్రికి ఫోన్ చేయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు వ్యాక్సినేషన్ విషయంలో మంత్రులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? కేంద్రాన్ని మార్చమని ఎవరు చెప్పారు? అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో.. మంత్రి నిజంగానే అలా చేశాడా? అనే చర్చ సాగుతోంది.