వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘరామ కృష్ణంరాజు వ్యవహారం భలే విచిత్రంగా ఉంది. తాజాగా హైకోర్టులో ఆయన వేసిన కేసే ఇందుకు నిదర్శనంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మళ్ళీ ఎంపి మరో కేసు వేశారు. ఇప్పటికే చాలా కేసులు వేసిన ఎంపి కొత్తగా మరో కేసు ఎందుకు వేశారు ? ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయటంలేదట.
ఇక్కడ గమనించాల్సిన విషయం కేసుల్లో సాక్ష్యాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణ చేస్తాయి కానీ ఎంపి అనుకున్నట్లు దర్యాప్తు చేస్తాయా ? ఎంపి అనుకున్నట్లు కోర్టు జగన్ బెయిల్ రద్దు చేస్తే సీబీఐ, ఈడీ బాగా దర్యాప్తు చేస్తున్నట్లు లేకపోతే లేదా ? దర్యాప్తులో బయటకొచ్చిన అంశాలను వదిలి పెట్టేస్తున్నాయట, కేసులకు సరైన ముగింపు ఇవ్వటంలో దర్యాప్తు సంస్ధలు విఫలమయ్యాయట.
సరైన ముగింపు అంటే ఎంపి ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా చెప్పలేదు. ఇప్పటికిప్పుడు జగన్ బెయిల్ ను అర్జంటుగా రద్దు చేసేసి అరెస్టుకు కోర్టు ఆదేశిస్తుందని రఘురాజు చాలా ఆశించినట్లున్నారు. అలా జరగకపోవటంతో పాపం నిరాసపడినట్లున్నారు. ఇదే సమయంలో జగ్ బెయిల్ రద్దు కాదని అరెస్టు చేయటం సాధ్యంకాదని ఎంపికి అనుమానం వచ్చినట్లుంది. అందుకనే జగన్ విషయం వదిలిపెట్టేసి సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయాలని కేసు వేశారు.