భారత్ - చైనా మధ్య సంబంధాలు రోజురోజుకీ తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. చైనా.. భారత్ సరిహద్దుల్లోకి చొరబడి మన భూభాగాన్ని ఆక్రమించుకుందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీ సైతం కాంగ్రెస్ పై మండిపడుతోంది. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని విమర్శలు చేస్తోంది.
చైనా ఆక్రమణలపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరో అంశంపైనా కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుమారుడు ధ్రువ్ జైశంకర్ కు చెందిన సంస్థకు నిధులు అందాయనే ఆరోపణలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి.
కాగా కాంగ్రెస్ తాజా ఆరోపణల విషయానికొస్తే.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుమారుడు ధ్రువ్ జైశంకర్ కు చెందిన ఓఆర్‌ఎఫ్ ఫౌండేషన్ అమెరికా నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పుడీ సంస్ధకు చైనా రాయబార కార్యాలయం నుంచి నిధులు అందినట్లు కాంగ్రెస్ మీడియా విభాగం నేత పవన్ ఖేరా ఆరోపణలు చేస్తుండటం కలకలం రేపుతోంది. ఓవైపు చైనా చొరబాట్లపై కేంద్రం మౌనంగా ఉంటోందని.. పార్లమెంటులో చర్చకు సైతం అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు జైశంకర్ కుమారుడి సంస్ధకు చైనా నిధులు అందుతున్నాయని.. అందుకే కేంద్రం మౌనంగా ఉంటోందా అని పవన్ ఖేరా ప్రశ్నించారు.
రాజస్ధాన్ లో ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో అదే రాష్ట్రానికి చెందిన పవన్ ఖేరా.. కేంద్ర విదేశాంగ మంత్రి కుమారుడిపై ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.
అమెరికాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుమారుడు ధ్రువ్ శంకర్ నాయకత్వం వహిస్తున్న ఫౌండేషన్... చైనా రాయబార కార్యాలయం నుండి మూడు సార్లు నిధులు పొందిందని పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. ఈ నిధులు చైనా నుంచి ఎందుకు వచ్చాయి.. ఇందుకు కారణం ఏమిటి? అంటూ పవన్ ఖేరా పలు ప్రశ్నలకు సంధించారు.
ఈ నేపథ్యంలో పవన్ ఖేరా ఆరోపణలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. మరోమారు కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధం తప్పదని అంటున్నారు. మున్ముందు ఈ అంశం రాజకీయంగా తీవ్రంగా కాక రేపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.