మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. గెలిచిన వారు ఇంట్లో ఏడుస్తుంటే.. ఓడినవారు రోడ్డుపై పడి ఏడుస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు మునుగోడుపై కోట్లు కుమ్మరించి నిండా ముంచాయి.. అవి మునిగిపోయాయి. లాభపడ్డది మాత్రం మునుగోడు ప్రజలే. ఈ నెలరోజుల పాటు మందు, విందు, ఓటుకు 5-6 వేల ఓట్ల వరకూ తీసుకొని పండుగ చేసుకున్నారు. నెలరోజుల పాటు సకల భోగాలు అనుభవించారు.
మునుగోడులో ఎన్నికల ఖర్చుపై విస్తృతంగా చర్చ సాగుతోంది. కొత్తగా మద్యం లెక్కలు బయటకొచ్చి సంచలనమయ్యాయి. తెలంగాణలో సగటున ప్రతినెల రూ.2700 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. అక్టోబర్ లో ఈ లెక్క రూ.3100 కోట్లు దాటిపోయాయి. అదనంగా వచ్చిన ఈ 400 కోట్లు మునుగోడు ఉప ఎన్నికలవేనన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.
మునుగోడులో మద్యం ఏరులై పారిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కో పార్టీ ఆఫీసు దగ్గర గుట్టలు గుట్టలుగా మద్యం బాటిళ్లు కనిపించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అన్ని పార్టీలు కలిపి మునుగోడులో రూ.400 కోట్ల మద్యాన్ని పంచాయి. జనానికి, పార్టీ నేతలకు, కార్యకర్తలకు పంచిపెట్టారు.
మునుగోడులో మద్యం ఖర్చే ఇంతలా ఉందంటే.. ఇక రాజకీయ పార్టీలు ప్రచారినికి.. ఓట్ల కొనుగోలుకు ఎంత ఖర్చు పెట్టాయో అంచనావేయడం కష్టమే. అయితే ఓటుకు రూ.5-6 వేల పంచినట్టు తెలిసింది.
ఇవే కాదు.. జనాలకు పండుగలు, పబ్బాలకు మాంసం కూడా పంచిపెట్టారు. చికెన్ కేజీ చొప్పున పంచారు. మటన్ ను పంచిపెట్టారు. ఇలా మందు,విందు, ఓటుకు నోటు తో మునుగోడు ఉప ఎన్నిక చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. మునుగోడులో ఎలక్షన్ కంటే బిజినెస్ జరిగిందన్న ప్రచారమే సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.