వేముల వ్యాఖ్యలకు పేర్ని నాని మాదిరి కాకుండా స్మూత్ గా షాకిచ్చిన సజ్జల

Update: 2021-11-13 07:30 GMT
కొందరు ఏదైనా చేస్తున్నప్పుడు చాలా సింఫుల్ గా.. ఇంతేనా? అన్నట్లుగా ఉంటుంది. కానీ.. దాన్ని చేసే ప్రయత్నం చేసినప్పుడు కానీ.. అదెంత కష్టమైన.. క్లిష్టమైనదన్నది అర్థం కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నే తీసుకోండి. విడిపోయి కలిసి ఉందామన్న పెద్ద మనిషి.. విడిపోయిన తర్వాత కూడా ఏపీ భుజాల మీద పిస్టల్ పెట్టి కాలుస్తుంటారు.

తెలంగాణ ప్రజల మనసుల్ని దోచుకోవటానికి ఏపీ మీద ఆయన అక్కసు వెళ్లగక్కుతుంటారు. ఇదే మాట అంటే.. పాపాత్ములైన ఏపీ పాలకుల మీదనే కానీ ఏపీ ప్రజల మీద ఎంత మాత్రం కాదంటూ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చి.. మళ్లీ తిడుతుంటారు. పాలకులు అంటే ప్రజలు ఎన్నుకున్న వారే కదా? లాంటి లాజిక్ ప్రశ్నల్ని మాత్రం సంధించకూడదు.

ఇదంతా ఎందుకంటే.. ఏపీని ఉద్దేశపూర్వకంగా నిందించటం అంత తేలిక కాదు.తిట్టేందుకు ఒక లెక్క ఉంటుంది. అదెలా ఉంటుందన్న విషయం తాజాగా వెల్లడైంది. వడ్లు కొనుగోలుకు సంబంధించి కేంద్రం మీద పోరు చేస్తున్న తెలంగాణ అధికారపక్షం.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించటం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి వేముల ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందనగా ఏపీ మంత్రి తన వ్యాఖ్యలతో షాకిస్తే.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్నసజ్జల రామక్రిష్ణారెడ్డి స్మూత్ గా వాయించేశారు.

ఏపీ మీద సీఎం కేసీఆర్ ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు విప్పే ప్రయత్నం చేయని వారు.. తాజాగా మంత్రి వేముల వ్యాఖ్యలు చేసినంతనే రియాక్టు కావటం గమనార్హం. ఏపీతో ఉన్న అన్ని సమస్యల్ని గొడవల్లేకుండా.. భేషజాలకు పోకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటామని సీఎం కేసీఆర్ పలు సందర్భా్లో చెప్పారని గుర్తు చేశారు. అయితే.. తెలంగాణ మంత్రులు మాత్రం ఏపీ మీద విమర్శలు చేయటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు.

కేసీఆర్ చెప్పిన మాటల్ని వారు వినలేదేమో? అన్న సజ్జల.. అయినా ఏపీ సంగతి తెలంగాణ మంత్రులకు ఎందుకు? అన్న సూటి ప్రశ్నను సంధించారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం వల్ల అందులో వాటా ఇవ్వాలని విభజన సమయంలో గట్టిగా పోరాడామని సజ్జల గుర్తు చేశారు. బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఏపీకి లేదని.. కేంద్రాన్ని నిధులు అడగటంతో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందన్నారు. సజ్జల వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. విమర్శలు చేసినా ఏపీ నేతలు రియాక్టు అయ్యేలా కేసీఆర్ తీరు ఉంటే.. అందుకు భిన్నగా కదిలించుకొని తిట్టించుకున్న రీతిలో టీ మంత్రి వేముల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.




Tags:    

Similar News