రెండు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు అదే పనిగా నమోదవుతున్నాయి. వైద్యం అందక మరణించేటోళ్లు మరణిస్తున్నారు. ఒకవైపు వేదన.. మరోవైపు భయం.. ఇలాంటివేళ కరోనా తప్పించి మరింకేమీ మదిలోకి వచ్చే పరిస్థితులు లేని వేళలో.. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా లొల్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు.
ఇలాంటివేళ.. ముదిరాజ్ ముద్దుబిడ్డ వరలక్ష్మి పేరుతో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రస్తావించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈటల ఎపిసోడ్ తో కొన్ని వర్గాలు కేసీఆర్.. కేటీఆర్ పై ఎంతలా ఫైర్ అవుతున్నారనటానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా చెప్పాలి. నిజానికి ఈటల తన మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. కానీ.. ఇందులోని వరలక్ష్మీ మాత్రం రాజీనామా చేసినట్లుగా ప్రకటించేశారు. 2001 నుంచి అనటానికి బదులు 2021 నుంచి కేసీఆర్ ఉద్యమాలు చేసినట్లు చెబుతున్నట్లుగా మాట్లాడారు. వీడియో చేసే హడావుడిలో తప్పు దొర్లి ఉంటుంది. ఈ రెండు మాటలు తప్పించి.. ఆమె చేసిన మరే వ్యాఖ్యలను టెక్నికల్ గా తప్పు పట్టాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.
అంతేకాదు.. కేసీఆర్.. కేటీఆర్ లకు గౌరవప్రదమైన బిరుదులు ఇచ్చేసి మరీ ఆడుకున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ను ఇప్పటివరకు ఎవరూ పిలవని రీతిలో.. కేసీఆర్ తాత అని.. కేటీఆర్ ను ‘అన్న’ అని అనుడే కాదు.. తరచూ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పని చేశానని చెప్పే కేసీఆర్ తాత మాటలకు ఈ ముద్దుబిడ్డ వరలక్ష్మీ భారీ కౌంటర్ ఇచ్చేసింది.
తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. సుత్తిలేకుండా చెప్పేసిన ఆమె తీరు చూస్తే.. ఈటల ఎపిసోడ్ లో కేసీఆర్ భారీగా బద్నాం అయ్యారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఉద్యమాలు చేశాం.. నిరాహార దీక్షలు చేశామని కేసీఆర్ తాత చెబుతుంటారు.
ఆయన కంటే ఉద్యమాలుచాలామంది చేశారు. ఉస్మానియా వర్సిటీలో చాలామంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. కేసీఆర్ తాత.. నీ కుటుంబంలో ఎవరైనా ప్రాణత్యాగం చేశారా? అంటూ సూటిగా అడిగేశారు. ఇది మొదలు.. అది.. ఇది అన్న తేడా లేకుండా కేసీఆర్ లోపాల్ని.. ఆయన మాటల్లోని తప్పుల్ని నిర్భయంగా వేలెత్తి చూపిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. కేసీఆర్ తాత అంటూ కడిగేసిన ముదిరాజ్ ముద్దుబిడ్డగా వరలక్ష్మి ఇప్పుడు తెగ పాపులర్ అవుతున్నారు. ఆమె వీడియోను కేసీఆర్ తాత.. కేటీఆర్ అన్న చూస్తే పరేషాన్ తప్పదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఆ అవకాశం ఉందంటారా?