ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రానికి వెళితే.. ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం.. ఆయన్ను దేశ్ కీ నేతగా అభివర్ణించటం ఎక్కువైంది. ఇలాంటి వేళ.. ఇంతకు ముందెప్పుడు ఎదురుకాని విచిత్రమైన పరిస్థితి తాజాగా ఎదురైంది. సీఎం కేసీఆర్ ను పొగుడుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మరో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. దాన్ని తొలగించే వరకు ఊరుకోని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ఫ్లెక్సీ మమతను ఇరిటేట్ చేసిందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే?
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో విపక్షాలన్ని కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలన్న లక్ష్యంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక భేటీని ఏర్పాటు చేశారు. దీనికి పలు పార్టీల అధినేతల్ని ఆహ్వానించారు. అయితే.. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారన్న కారణంగా తాము ఈ భేటీకి హాజరు కాకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్.. తాను కానీ తమ పార్టీ తరఫున ఎవరిని పంపలేదు.
భేటీకి ఆహ్వానించినప్పటికీ సీఎం కేసీఆర్ రాకపోవటం.. ఆ సమాచారం క్యాడర్ కు సరైన రీతిలో సమాచారం అందకపోవటంతో.. తమ అధినేతను ఆకాశానికి ఎత్తేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్ కు స్వాగతం.. దేశ్ కా నేత కేసీఆర్ పేరుతో రాయించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
కేసీఆర్ ను అభిమానించే పెనుగొండ సాయి సప్త కుమార్ అనే టీఆర్ఎస్ నేత.. భేటీ జరిగే క్లబ్ ముందు వీటిని ఏర్పాటు చేశారు. భేటీకి పిలిస్తే రాకుండా డుమ్మా కొట్టిన కేసీఆర్ కు చెందిన ఫ్లెక్సీ దర్శనం ఇవ్వటంతో టీఎంసీ నేతలకు కాలేలా చేసిందంటున్నారు.
అంతేకాదు.. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాలిపోయింది. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించాలని పార్టీ నేతలపై ఆమె విరుచుకుపడటంతో.. ఉన్న పళంగా ఆ ఫ్లెక్సీని తొలగించాలని క్లబ్ వారికి చెప్పటంతో వారు దాన్ని తొలగించారు.
ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు చోటు చేసుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇక నుంచైనా కేసీఆర్ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో గులాబీ అభిమానులు ఆచితూచి వ్యవహరించాలని.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది.