మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం ఎదురైందని టీడీపీ మీడియా, నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేతను అందరిలాగే తనిఖీలు చేశారని.. సాధారణ ప్రయాణికుల బస్సులోనే పంపారని రాద్ధాంతం చేస్తున్నారు. అయితే ఆయన ఇంకా సీఎం అనుకుంటున్నారని.. ప్రతిపక్ష నేతకు ఇచ్చే సెక్యూరిటీనే ఆయనకు కల్పిస్తారని వైసీపీ చెబుతోంది.
తాజాగా విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంపై ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. ‘గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగినప్పుడు ఆయనకు భద్రత కల్పించలేదు. ఈ వ్యవహారంలో పచ్చ మీడియా పట్టించుకోలేదు. ఇప్పుడు బాబుకు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే ఆయనను అవమానిస్తున్నారని.. ఎల్లో మీడియా శోకాలు పెడుతోందని’ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టా.? అని విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బీసీ నేత తమ్మినేనిని స్పీకర్ చేస్తే గౌరవించని చంద్రబాబు.. నాడు తన కులానికి చెందిన కోడెలను స్పీకర్ చేస్తే జగన్ గౌరవించి తీసుకెళ్లి సంప్రదాయం పాటించారని.. బాబుకు జగన్ కు అదే తేడా అని విజయాసాయిరెడ్డి విమర్శించారు.
ఇక బంట్రోతు వ్యాఖ్యలపై కూడా విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు.. ప్రజలకు బంట్రోతులని బాలయ్య భలే డైలాగ్ చెప్పాడని విజయసాయిరెడ్డి సైటైర్ వేశారు. మహిళా తహసీల్దార్ ను ఇసుకలో పడేసి నాడు టీడీపీ ఎమ్మెల్యే కొట్టాడని.. ఆశావర్కర్లను మరో టీడీపీ ఎమ్మెల్యే తిట్టాడని.. కేట్యాక్స్ పేరిట వసూలు చేసిన మాజీ స్పీకర్ కూడా బంట్రోతేనా అని ట్వీట్ లో విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.