టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒక ఎత్తువేస్తే.. అది మరో ఫలితం ఇచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న క్రమంలో ఆ పార్టీకి ముకుతాడు వేయాలని - తన ప్రాబల్యం పెంచుకోవాలని కేసీఆర్ భావించారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎదుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడి పార్టీ అభివృద్ధి సహా.. బీజేపీ నేతలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నలుగురు నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయితే, వీరిలో ఇద్దరు మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. తమలో తామే విభేదాలు పెట్టుకున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు నలుగురిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కొప్పుల ఈశ్వర్ - ఈటల రాజేందర్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మరో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. వీరిలో కేసీఆర్ కూడా ఉన్నారు. వీరిలో గంగుల కమలాకర్ ఉన్నారు. అయితే, ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు కొన్ని శక్తులు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేశాయని - డబ్బులు కూడా పంచాయని ఆరోపిస్తున్న ఈటెల గంగులపై అక్కసు పెంచుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన గంగులతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఇద్దరు మంత్రులు కలుసుకొన్నా కూడ మాట మాత్రం పలకరించుకోలేదు. పైగా వీరు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమీక్ష సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొనలేదు. కానీ, ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం జరిగినా..ఇద్దరూ వేర్వేరుగానే హాజరయ్యారు.
దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఇద్దరు మంత్రుల వ్యవహార శైలి కారణంగా జిల్లాలో కేసీఆర్ వ్యూహం పారేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇక్కడ మరో ప్రచారం కూడా ఉంది. ఇటీవల ఈటల పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఓపెన్ గానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటలకు షాక్ ఇచ్చేందుకే కేసీఆర్ గంగులను కేబినెట్ లోకి తీసుకుని ఎంకరేజ్ చేస్తున్నారని అంటున్నారు. ఏదెలా ఉన్నా ఇద్దరు మంత్రుల మధ్య సరైన సఖ్యత అయితే లేదు.