బాబుకు - జగన్ కు తేడా అర్థమవుతోంది

Update: 2019-07-08 11:31 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్.. త‌న పాల‌న‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చి కేవ‌లం నెల రోజులు కూడా గ‌డ‌వ‌క ముందుగానేఆయ‌న త‌న పాల‌న ఎంత పార‌ద‌ర్శ‌కంగా ఉంటుందో చేత‌ల ద్వారా చేసిచూపిస్తున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న ఎక్క‌డా సొంత డ‌బ్బాకు అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. పెద్ద‌గా ప్ర‌చారాన్ని కూడా కోరుకోవ‌డం లేదు. పైగా త‌న చేతులు మీడియాకు కూడా తెలియ‌కుండా అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు కూడా ఎలాంటి ప్ర‌చారానికి తావివ్వ‌డం లేదు., త‌ద్వారా జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వం, పాల‌న అంతా కూడా ప్ర‌చారానికి దూర‌మ‌నే విష‌యాన్ని చెప్పుకొస్తున్నారు.

వాస్త‌వానికి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని తీసుకుంటే.. ఏ ప‌నిచేయాల‌న్నా కూడా తాత్సారం చేశార‌నే చెడ్డ‌పేరు తెచ్చుకు న్నారు. ప‌ది కోట్ల రూపాయ‌ల‌తో అయ్యే ప‌నైనా.. ప‌ది ల‌క్ష‌ల రూపాయలు ఖ‌ర్చ‌య్యే ప‌నినైనా కూడా రెండింటినీ ఒకే విధం గా చూశార‌ని, భారీ ఎత్తున స‌మ‌యం తీసుకున్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అదేస‌య‌మంలో త‌న ప్ర‌భుత్వ ప్ర‌చారానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించార‌ని, ప్ర‌జాధ‌నాన్ని ప్ర‌చారం కోసం నీళ్ల మాదిరిగా ఖ‌ర్చు చేశార‌నే అప‌వాదును కూడా మూట‌గ‌ట్టుకున్నారు.

కానీ, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ప్ర‌చారానికి దూరంగా, వృథా ఖ‌ర్చుల‌కు క‌ళ్లెం వేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఇక‌, గ‌త ప్ర‌భుత్వం రైతుల‌కు, డ్వాక్వా మ‌హిళ‌ల‌కు ఇచ్చిన హామీలు స‌గంలోనే నిలిచిపోయాయి. ఐదేళ్ల పాల‌నా కాలంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండానే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చాప‌చుట్టేసింది. ఈ క్ర‌మంలో తాము ఇచ్చిన హామీల‌ను కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం నెర‌వేర్చాల‌ని బాబు అండ్‌ కో ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌ ను డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.

అయితే, దీనిపై బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌హా కొంద‌రు మంత్రులు మాత్రం స్పందించారు. మీరిచ్చిన హామీల‌ను  మేం ఎందుకు నెర‌వేర్చాల‌ని ప్ర‌శ్నించారు. దీనిపై అప్ప‌ట్లో జ‌గ‌న్ ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేదు. అయితే, తాజాగా మాత్రం త‌న తండ్రి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను కూడా నెర‌వేరుస్తున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీనిలో ప్ర‌ధానంగా రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఇస్తామ‌ని చెప్పిన హామీలు ఉండ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం కానుండ‌డం గ‌మ‌నార్హం.

    

Tags:    

Similar News