ప్రభుత్వ ముఖ్య అధికారి - జగన్ సలహాదారుల మధ్య ఏం జరుగుతోంది?

Update: 2019-08-27 14:30 GMT
ఏపీ ప్రభుత్వంలో ఒక ముఖ్య అధికారికి - సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహారులు అయిన ఇద్దరికి మధ్యన కొన్ని విషయాల్లో ఇప్పుడు ఇబ్బందులు పొడసూపుతున్నాయనే  ప్రచారం సాగుతూ ఉంది. కొన్ని విషయాల్లో వారి మధ్యన విబేధాలు మొదలయినట్టుగా భోగట్టా.

జగన్ మోహన్ రెడ్డి తన వెంట మొదటి నుంచి ఉన్న ఒక వ్యక్తికి ప్రభుత్వంలో సలహాదారుగా కీలక పదవిని ఇచ్చారు. అలాగే మరొక ఎక్స్ బ్యూరో క్రాట్ కు కూడా కీలక పదవిని కేటాయించారు. వారిద్దరూ ప్రభుత్వంలో కీలకంగా మారారు. వారి సలహాలకు జగన్ మోహన్ రెడ్డి మంచి విలువను ఇస్తూ వస్తున్నారు కూడా.

ఇక ముఖ్య అధికారికీ జగన్ మోహన్ రెడ్డి బాగానే ప్రాధాన్యతను ఇస్తూ  వస్తున్నారు. ఇలా వారందరికీ జగన్ ప్రాధాన్యతను ఇస్తున్నప్పటికీ వారిలో వారికి మాత్రం కొన్ని విషయాల్లో తగవులు వస్తున్నట్టుగా సమాచారం. సలహాదారులు కొన్ని ఫైల్స్ ను తమ సిఫార్సులతో పంపుతుండగా ముఖ్య అధికారి వాటిపై గ్రీన్ ఇంక్ సంతకం పెట్టేందుకు ఓకే అనడంలేదట.

ఒక ఫైల్ విషయంలో అయితే అలాంటివి తన వద్దకు పంపవద్దని ముఖ్య అధికారి తేల్చి చెప్పాడట.  వాటిపై సంతకాలు  పెడితే తను భవిష్యత్తుల్లో జైలుకు  వెళ్లాల్సి ఉంటుందని - అందుకు తను  రెడీగా లేనట్టుగా ఆయన తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ఇలా జగన్  కు అతి దగ్గరగా ఉండే ముగ్గురి మధ్యన కొన్ని విషయాల్లో విబేధాలు పొడసూపుతున్నట్టుగా సమాచారం అందుతోంది!

   

Tags:    

Similar News