విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమన్నట్టు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గానికి చెందిన 200 వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమై రాష్ట్ర దేవదాయా శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా గళం వినిపించడం కలకలం రేపింది. మంత్రి అయ్యాక వెల్లంపల్లి పార్టీ శ్రేణులను పూర్తిగా విస్మరించారని వారంతా బుధవారం సమావేశంలో ఆరోపించారు. వైసీపీ గెలుపు కోసం శ్రమించిన తమను కాదని.. మంత్రి తన బినామీలు, అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారంతా విమర్శలు చేయడంతో వైసీపీ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.
మంత్రి వెల్లంపల్లి వైఖరికి నిరసనగా నియోజకవర్గానికి చెందిన 200మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం సాయంత్రం భవానీపురంలోని వైసీపీ నేత ఇంట్లో సమావేశమవ్వడంతో ఈ విభేదాలు పొడచూపినట్టు అయ్యింది.
ఈ నేతలంతా మంత్రి తీరుపై మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. తన ఉన్న వారికే పదవులు, కాంట్రాక్టులు ఇస్తున్నారని.. పార్టీ కోసం పనిచేసిన వారిని అణగదొక్కుతున్నారని నేతలంతా ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అణగదొక్కుతున్నారని వారంతా విమర్శించారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని.. సీఎం జగన్ సూచించినా పార్టీ కోసం పనిచేసిన నేతలను పట్టించుకోవడం లేదని నేతలంతా ఆరోపించారు. వీరంతా కలిసి సీఎం జగన్ ను కలిసి ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారు. దీంతో పశ్చిమ నియోజకవర్గం లొల్లి ముదిరిపాకాన పడినట్టు అయ్యింది.