ఓటుకు నోటు.. ఒక్కో చోట ఒక్కో రేటు!

Update: 2019-04-10 06:32 GMT
-పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతున్న వేళ రాజకీయ నేతల ప్రలోభాలు తీవ్రంగా సాగుతూ ఉన్నాయి. విజయం కోసం ఓటుకు నోటు మంత్రాన్ని జపిస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు.

-ఓటుకు నోటు పంచడంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. అందరూ అందరే. జనసేన పార్టీ అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గట్టిగానే పంపకాలు సాగిస్తుండటం విశేషం.

-ఓటుకు నోటు పంచని నేతలను అసలు పోటీలో ఉన్న వారిగా ఎవరూ పరిగణించడం లేదు. డబ్బులు పంచని వాళ్లు ముందే ఓటమిని ఒప్పేసుకున్నట్టుగా అవుతోందని అంటున్నారు జనాలు కూడా.

-ఇక ఓటు ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. నియోజకవర్గాన్ని బట్టి, నేతలను బట్టి అది మారుతూ ఉంది.

-కొన్ని చోట్ల ఓటుకు ఐదారు వేల రూపాయలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల పదివేల రూపాయలు అని కూడా చెబుతున్నారు. ఇంట్లో ఓట్లను హోల్ సేల్ గా కొంటున్న వారు ఉన్నారనే సమాచారం కూడా అందుతోంది.

-అయితే కొన్ని చోట్ల ఓటుకు నోటు అందడం లేదని కూడా కొంతమంది వాపోతున్నారు. తమకు ఇప్పటి వరకూ ఓటేయమని ఎవరూ డబ్బులు ఇవ్వలేదని గ్రౌండ్ లెవల్లో కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉండటం విశేషం.

-కొందరు నేతలు ఓటుకు ఐదు వందల రూపాయలే ఇస్తున్నారనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఆ విషయంలో జనాలు అసంతృప్తిగా ఉన్నారు.

-ప్రత్యర్థులు అయిన నేతలే మాట్లాడుకుని పని చేస్తూ ఉన్నారని, వారిద్దరూ కూడబలుక్కుని కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పంచుతున్నారని.. అదంతా నేతల కుట్ర అని కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు నోటు ఆశిస్తున్న జనాలు అనుకుంటున్నారు.

-మూడు రోజుల నుంచి గట్టిగా పంపకాలు సాగుతూ ఉన్నాయి. ఈ రోజు ఫైనల్. రాత్రి వరకూ పంపకాలకు అయితే లోటు లేదు.
Tags:    

Similar News