రూ. 500 - 1000 నోట్లు రద్దు అని ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో నల్ల కుబేరులను దారిలోకి తెస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి సామాన్య ప్రజల జీవితాలను మాత్రం అతలాకుతలం చేసేసింది. చేతిలో డబ్బున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయులుగా మార్చేసింది. తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇచ్చినప్పటీకీ... ఉన్న నోట్ల చెలామణీని వెంటనే రద్దు చేయడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రతీ ఒక్కరి జేబులో పెద్దనోట్లే ఉండటంతో... జేబులో వెయ్యి ఉన్నా కిలో కాయగూరలు కొనలేని పరిస్థితి. ఈ క్రమంలో సామాన్యుడి జీవితంతో ఈ పాత నోటు ఎలా పరాచకాలుడుతుందో ఇప్పుడు చూద్దాం...
ఈ విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజల కష్టాలు మాములుగా ఉండేలా కనిపించడంలేదు. కారణం... దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల గ్రామాలు ఉన్నాయని అంచనా.. కానీ ప్రతి గ్రామంలోనూ బ్యాంకులు లేవు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, రోజువారీ కూలీలు - వ్యాపారులు పెద్ద నోట్ల మార్పిడిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. దీంతో అన్ని పనులు మానుకొని కొన్ని రోజులపాటు సమీప ప్రాంతాల్లోని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి!
వాహనదారులు విషయానికొస్తే... వీరంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెద్దనోట్లను పెట్రోల్ బంకుల్లో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినప్పటికీ తమవద్ద చిల్లర లేదంటూ బంకు యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలీక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నగరాల్లోని పెద్దపెద్ద షోరూంలు, షాపింగ్ మాల్స్ లాంటి వాటిపై పెద్ద ప్రభావం చూపించకపోయినా... చిన్న, ఒక మోస్తరు షాపుల వారికి షాకింగ్ గా మారింది. పెద్ద పెద్ద షాపుల్లో కార్డ్ స్వైపింగ్ తో అయినా షాపింగ్ జరిగిపోతుంది. కానీ... కూరగాయలు - పండ్ల దుకాణాలు - టిఫిన్ సెంటర్ల పరిస్థితైతే.. అటువైపు చూసేవారే కరువయ్యారు!!
నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఉదయం నుంచీ తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వరకూ దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ అర్థరాత్రి వరకూ టోల్ ట్యాక్స్ రద్దు అమల్లో ఉంటుంది. ఈ ప్రకటన రాకముందు వాహనదారులు తమ వద్ద చిల్లర లేదంటూ 500, 1000 రూపాయల నోట్లే ఇస్తుండటంతో ఆ టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఇదే క్రమంలో పర్యాటకుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికే పర్యటనల్లో ఉన్నవారు, మోడీ ప్రకటన వచ్చే సరికి ప్రయాణాల్లో ఉన్నవారి పరిస్థితి మామూలుగా లేదు! ప్రయాణాల్లో ఎక్కువగా క్యాష్ క్యారీ చేయకుండా... కార్డులతోనే ప్రయాణించిన వారు... ఆయా ప్రాంతాలకు చేరిన తర్వాత ఏటీఎం లు పనిచేయక, చేతిలో డబ్బులు లేక పడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు! ఏటీఎంలు, బ్యాంకులు కూడా మూతపడి ఉన్నందున టూరిస్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ఈ సమయంలో విదేశీ పర్యాటకులకు ఉచితంగా సందర్శించే అవకాశం ఇవ్వాలని పర్యాటక రంగ నిపుణులు అంటున్నారు.
తాజా ప్రకటనతో ఈ కామర్స్ కంపెనీలు కూడా షాకయ్యాయి. రూ.500. రూ.1000 నోట్ల చెలామణిని కేంద్రం నిలిపివేయడంతో ఈ కామర్స్ సంస్థలపై దాని ప్రభావం గట్టిగానే పడింది. ఈ క్రమంలో ప్లిప్ కార్డ్, స్నాప్ డీల్, అమెజాన్ వంటి సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి.
సినిమారంగంపై కూడా ఈ నోట్ల రద్దు వ్యవహారం పెద్ద కుదుపునే కలిగించింది. ముఖ్యంగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాల మీద ఈ ప్రభావం తీవ్రంగా కనిపించనుంది. వంద రూపాయల నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో శుక్రవారం ఎంత మంది ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారు అన్నది ప్రశ్నగా మారింది. దీంతో ఈ వారం రిలీజ్ అవుతున్న ఇంట్లో దెయ్యం నాకేం భయం, సాహసం శ్వాసగా సాగిపో చిత్రయూనిట్ లు ఆలోచనలో పడ్డారట.
ఇదే సమయంలో సెట్స్ మీదున్న సినిమాలపై కూడా ఈ ప్రభావం భారీగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా రోజువారి పేమెంట్సే ఉండటం, వాటికోసం 500 - 1000 నోట్లనే వినియోగిస్తుంటారు నిర్మాతలు. దీంతో ఒక్కసారిగా ఆ నోట్ల వినియోగం ఆగిపోవటంతో షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా... బుధవారం ఉదయం తిరుమలలోని అన్ని కౌంటర్లలో 500 - 1000 నోట్లను టీటీడీ సిబ్బంది స్వీకరించకపోవడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. అనంతరం ప్రభుత్వం దీనిపై భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ నోట్లను తీసుకోవాలని ఆదేశించడంతో టీటీడీలో అన్ని కౌంటర్లలో ప్రస్తుతం 1000 - 500 నోట్లను సిబ్బంది స్వీకరిస్తున్నారు. అంతకముందు వరకూ భక్తులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు!
అందరి ఇబ్బందులు ఒక ఎత్తు అయితే.. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్న వారి కష్టాలు చెప్పుకొంటే "అంతకు మించి" అన్నట్లు మారింది. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు సరైన రోజులు కావటంతో పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖర్చుల కోసం భారీగా నగదును ఇంటికి తెచ్చుకున్న వారు తాజా పరిణామంతో షాక్ అయ్యే పరిస్థితి. చేతి అవసరాల నిమిత్తం చిన్న నోట్ల కోసం వారు పడుతున్న ఇబ్బందులు మాములుగా లేవు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/