ఉమ్మడిరాష్ట్రంలోనూ.. విడిపోయిన తర్వాతా.. ఎప్పుడూ చోటు చేసుకోని సిత్రమైన సీన్ ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుందని చెప్పాలి. ఒకే అంశం మీద అధికారపక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తుంటే.. విపక్షం నిరసన దీక్ష నిర్వహిస్తుండటం.. అది కూడా ఒకే రోజు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏపీలో నెలకొన్న ఇసుక కొరతకు అధికారపక్ష నేతలు దందానే కారణమని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తుండగా.. వరద పోటు ఎక్కువగా ఉండటంతో ఇసుక వెలికితీత ఆగిపోవటమే కారణమని అధికారపక్షం స్పష్టం చేస్తోంది. అందుకు తగ్గట్లే వరద పోటు తగ్గినంతనే ఇసుక వెలికితీత కార్యక్రమం జోరందుకోవటమే కాదు.. కొరతను మరో వారం..పది రోజుల్లో తీర్చేలా ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఏపీలో ఇసుక సమస్య లేదని చెప్పలేం.. కానీ.. అదేమీ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పే కన్నా.. వాతావరణ కారణాల వల్ల చోటు చేసుకున్న సమస్యగా చెప్పాలి. దీన్ని.. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నిస్తుంటే.. అసలు వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ.. ప్రజలు పడుతున్న కష్టాలకు పుల్ స్టాప్ పెట్టేలా తాము చర్యలు తీసుకుంటామని చెబుతోంది ఏపీ ప్రభుత్వం.
ఇలాంటివేళ.. ఏపీ అధికారపక్షం ఈ రోజు నుంచి వారం పాటు ఇసుక వారోత్సవాల్నినిర్వహిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగ్గట్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారోత్సవాలు పూర్తి అయ్యే నాటికి రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేయటంతో పాటు.. ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు.. ఇసుక ధరను అధిక ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఒకవేళ ఎవరైనా కక్కుర్తికి పాల్పడితే ఏకంగా రెండేళ్ల జైలుశిక్ష విధించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఇసుక కొరతను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మొన్నటికి మొన్న విశాఖలో ఇసుక కొరత మీద లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడితే.. తాజాగా ఈ రోజు విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్షను చేపడుతున్నారు.
ఇసుక విషయంలో ఏపీ అధికారపక్షం ఫెయిల్ అయిందన్న భావన కలిగేలా ఆయన దీక్షను చేస్తున్నారు. ఈ రోజు (గురువారం) రాత్రి 8 గంటల వరకూ సాగనున్న ఈ దీక్ష కోసం టీడీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. తన బలగాన్ని దించటంతో పాటు.. బలప్రదర్శన కోసమన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రయత్నంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.
ఇసుక సమస్యను తక్షణం పరిష్కరించటంతో పాటు.. ఉచితంగా అందించాలన్న గొంతెమ్మ డిమాండ్ తో పాటు.. పనులు లేని కార్మికులకు నెలకు రూ.10వేలు చొప్పున పరిహారాన్ని.. ఇసుక కొరత కారణంగా మరణించిన కుటుంబానికి రూ.25లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఇసుక వారోత్సవాలు.. మరోవైపు ఇసుక దీక్షతో ఏపీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పాలి.